BB3 అప్‌డేట్.. ఎట్టకేలకు బాలయ్య హీరోయిన్ ఫిక్స్..!

0
425
Hot Tamil Actress Sayyeshaa is confirmed for Balakrishna BB3 movie

Nandamuri Balakrishna: Sayyeshaa Saigal: BB3: మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, నందమూరి నటసింహం బాలకృష్ణ కాంబోలో తెరకెక్కుతున్న భారీ సినిమాకు సంబంధించి క్రేజీ అప్‌డేట్ బయటకొచ్చింది. నందమూరి బాలకృష్ణ – డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ‘సింహా’ ‘లెజెండ్’ వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. గత కొన్ని నెలలుగా బోయపాటి శ్రీను- బాలయ్య కాంబోలో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గురించి చర్చలు నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా హీరోయిన్ సాయేషా ట్వీట్‌తో ఆ చర్చలకు ఫుల్‌స్టాప్ పడింది. బీబీ 3లో తానే హీరోయిన్‌గా నటిస్తున్నట్లు కన్ఫర్మ్ చేస్తూ ట్వీట్ చేసింది సాయేషా.

అక్కినేని అఖిల్ డెబ్యూ మూవీ ‘అఖిల్’ తో హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయమైన సయాషా సైగల్ ని ఇప్పుడు బాలయ్య కు జోడీగా తీసుకున్నారు. హిందీలో అజయ్ దేవగన్ తో ‘శివాయ్’.. తమిళ్ లో కార్తీ సరసన ‘చినబాబు’.. సూర్యతో కలిసి ‘బందిపోటు’ సినిమాల్లో నటించింది. లాక్‌డౌన్ ముందే షూటింగ్ ప్రారంభించిన BB 3 యూనిట్.. కరోనా కారణంగా గత కొన్ని నెలలుగా షూటింగ్ వాయిదా వేసుకుంది. ఇటీవలే షూటింగ్స్ రీ ఓపెన్‌ కావడంతో తిరిగి సెట్స్ పైకి వచ్చేశారు.

ఈ భారీ ప్రాజెక్టులో అవకాశం దక్కడం గౌరవంగా ఫీల్ అవుతున్నానని, అతి త్వరలో షూటింగ్‌లో పాల్గొనబోతున్నానని పేర్కొంటూ చాలా ఆతృతగా ఉందని తెలిపింది సాయేషా. ఇప్పటికే విడుదలైన BB 3 ఫస్ట్ రోర్‌ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పింది. ఈ సినిమాకు ‘టార్చ్‌బేరర్’ అనే డిఫరెంట్ టైటిల్ ఫిక్స్ చేశారననే టాక్ నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. ఈ సినిమాకు మిర్యాల రవీంద్రనాథ్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తుండగా థమన్ సంగీతం సమకూరుస్తున్నారు.

Previous articleహాస్పిటల్ నుంచి రాజశేఖర్ డిశ్చార్జ్..!
Next articleActress Sayyeshaa Saigal Confirmed For Balakrishna BB3