‘హౌస్ అరెస్ట్’ సినిమా టీజర్

338
house-arrests-fun-teaser-released
house-arrests-fun-teaser-released

ప్రముఖ హాస్య నటులు శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, అదుర్స్ రఘు, తాగుబోతు రమేష్ కీలక పాత్రలు రూపొందుతున్న వినోదాత్మక చిత్రం ‘హౌస్ అరెస్ట్’. ’90ఎంఎల్’ సినిమా దర్శకుడు శేఖర్ రెడ్డి ఎర్ర ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

 

 

శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కె. నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన హౌస్ అరెస్ట్ ప్రచార చిత్రాలు మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా  టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

 

 

చిచ్చర పిడుగుల్లాంటి కిడ్స్..  వాళ్ళ చేత చిక్కిన దుండగుల బ్యాచ్ మధ్య జరిగిన అల్లరిని చూపిస్తున్న ఈ టీజర్ అన్ని వర్గాలను అలరిస్తోంది. ఈ చిత్రానికి సంగీత సంచలనం అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.