War 2 Shooting Update, War 2 Movie Update, War 2 updates, NTR and Hrithik Roshan next movie latest news, Hrithik Roshan movies, NTR Devara Goa Shoot photos , Hrithik Roshan and Jr NTR’s Scene Shot with Body Double in War 2 Shooting
జూనియర్ ఎన్టీఆర్ అలాగే రుతిక్ రోషన్ మొదటిసారిగా కలిసి చేస్తున్న సినిమా వార్ 2. ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజుల క్రితం స్పెయిన్‌లో స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. వార్ 2 హృతిక్ రోషన్ మరియు ఎన్టీఆర్ బాడీ డబుల్స్‌తో పెద్ద ఛేజింగ్ సీక్వెన్స్‌ను పూర్తి చేసినట్టు సమాచారం అయితే తెలుస్తుంది. దర్శకుడు అయాన్ ముఖర్జీ స్పెయిన్‌లో ‘వార్ 2’ మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసారు, ఇందులో హృతిక్ రోషన్ మరియు ఎన్టీఆర్‌లతో యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే రుతిక్ అలాగే ఎన్టీఆర్ స్థానంలో బాడీ డబుల్స్ (డూపులు) నటించారు.
ప్రధాన తారాగణం లేకుండా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించి, సాంకేతికతను ఉపయోగించి వాస్తవ దృశ్యాలను మెరుగుపరిచే ఈ కొత్త టెక్నిక్‌ని ఈ సినిమాలో వాడుకుంటున్నారు. సుమారు రెండు వారాల వ్యవధిలో, అయాన్ ముఖర్జీ భారతీయ సినిమాలో అత్యంత పెద్ద ఛేజింగ్ సీక్వెన్స్‌లకు ఫైట్ మాస్టర్స్ సహాయంతో పూర్తి చేయటం జరిగింది. హృతిక్ రోషన్ మరియు ఎన్టీఆర్ ముంబై మరియు హైదరాబాద్‌లలో తమ తమ సినిమాలకు సంబంధించిన షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
వార్ 2 హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌లను ముందుగా బాడీ డబుల్స్‌తో క్యాప్చర్ చేయడం, ఆపై అధునాతన బాడీ స్వాప్ టెక్నాలజీని ఉపయోగించి ప్రధాన నటులతో వారి ముఖాలను డిజిటల్‌గా మార్చుకోవడం దీని లక్ష్యం. స్పెయిన్‌లో ఉన్నప్పుడు, అయాన్ హ్రితిక్ మరియు ఎన్టీఆర్‌ల కోసం పర్ఫెక్ట్ బాడీ డబుల్స్‌ను జాగ్రత్తగా సెలెక్ట్ చేయడం జరిగింది మేకర్స్. అయితే ఈ సెలక్షన్స్ లో దాదాపుగా 50 మందికి పైగా ప్రతిభావంతులతో ఆడిషన్స్ నిర్వహించారు. స్పెయిన్‌కు వెళ్లే ముందు, ఎంపిక చేసిన స్టంట్ డబుల్స్ ముంబై మరియు హైదరాబాద్‌లలో ప్రధాన నటులతో టెస్ట్ షూట్‌లను చేయటం కూడా జరిగింది.

దాదాపు 12 రోజుల పాటు సాగిన స్పెయిన్ షెడ్యూల్ ప్రధానంగా యాక్షన్ సన్నివేశాలపైనే షూటింగ్ చేశారు. కియారా అద్వానీ కూడా ఈ షూటింగ్ లో పాల్గొన్నట్టు తెలుస్తుంది. మేకర్స్ వార్డు సినిమాని రిపబ్లిక్ డే స్పెషల్గా 2025లో విడుదల చేయుటకు సిద్ధం చేస్తున్నారు. డిసెంబర్ 2024 నుండి ఇద్దరు హీరోలు షూట్‌లో జాయిన్ అవుతారని.. 2024 మిడ్ నాటికి మొత్తం షూటింగ్ పూర్తి చేసి, పైన చెప్పినట్లుగా వార్ 2 చిత్రాన్ని 2025 జనవరిలో విడుదల చేయాలనేది యూనిట్ ప్లాన్.