Hrithik Roshan And Tiger Shroff At 'War' Movie Teaser Talk
Hrithik Roshan And Tiger Shroff At 'War' Movie Teaser Talk

లేటెస్ట్ గా సూపర్ 30 లాంటి ప్రయోగాత్మక సినిమా చేసి మిక్స్డ్ రిజల్ట్ అందుకున్న హ్రితిక్ మళ్ళీ అదిరిపోయే యాక్షన్ ఫీస్ట్ ఇవ్వడానికి రెడీ అయిపోయాడు.పైగా అది కూడా ఈ సంవత్సరమే ఆ సినిమా రిలీజ్ కాబోతుంది.హ్రితిక్ తో పాటు టైగర్ ష్రాఫ్ కూడా ఆ సినిమాలో మరొక హీరోగా నటిస్తున్నాడు.టైగర్ లుక్ ఎప్పట్లానే రగ్గడ్ గా ఉంది.కానీ హ్రితిక్ మాత్రం హెయిర్ స్టైల్ దగ్గరనుండి ప్రతిదీ కొత్తగా ట్రై చేసినట్టున్నాడు.

[INSERT_ELEMENTOR id=”3574″]

బాలీవుడ్ లో బెస్ట్ హంక్స్ అయిన ఆ ఇద్దరు ఒకే సినిమాలో కలిసి నటించడం,టీజర్ లోనే ఆ సినిమా లో ఎలాంటి హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ ఉండబోతున్నాయి అని హింట్ ఇవ్వడంతో ఆ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.పైగా ఈ సినిమాకి హ్రితిక్ తో కలిసి గతంలో బ్యాంగ్ బ్యాంగ్ అనే సినిమా అందించిన సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించడం అనేది మరొక ప్లస్ పాయింట్.యాష్ రాజ్ ఫిలిమ్స్ పర్మినెంట్ హీరోయిన్ అయిన వాణి కపూర్ ఈ సినిమాలో కూడా అందాలతో దాడి చెయ్యడానికి రెడీ అని బీచ్ లో బికినీ వేసిన ఒకే ఒక్క షాట్ తో కన్వే చేసారు.విశాల్ శేఖర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి అబ్బాస్ టైర్ వాలా డైలాగ్స్ రాస్తున్నాడు.ఇక నిర్మాత ఆదిత్య చోప్రా కూడా రైటింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్నాడు కాబట్టి వార్ బాక్స్ ఆఫీస్ దగ్గర వన్ సైడెడ్ గా విజయ్ అందుకోవడం దాదాపు ఖాయమే.

[INSERT_ELEMENTOR id=”3574″]