NTR and Janhvi Kapoor Devara shooting update, Devara shooting location, Devara Audio rights, Jr NTR next movie, Devara teaser update, Latest news
కొరటాల శివ అలాగే జూనియర్ ఎన్టీఆర్ (NTR) కలిసి చేస్తున్న లేటెస్ట్ మూవీ దేవర (Devara). ఈ సినిమా షూటింగు మొత్తం అవుట్డోర్ కాకుండా ఇండోర్లోనే చేయడం జరుగుతుంది. షూటింగ్ దశలో ఉండే ఏ సినిమాకైనా లీక్స్ అనేవి తప్పవు కానీ ఎన్టీఆర్ దేవర సినిమాకి మొదటి దగ్గర నుంచి ఇప్పటిదాకా ఎటువంటి లిక్స్ లేకుండా కొరటాల శివ అలాగే మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. అయితే ఎన్టీఆర్ మేకర్స్ ఈ సినిమా కోసం భారీగానే ఖర్చు పెడుతున్నట్టు తెలుస్తుంది .
సినిమా షూటింగ్ విషయానికి వస్తే, గ్యాప్ లేకుండా ఒకవైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేస్తున్నారు కొరటాల శివ. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ సెట్స్ కూడా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.. అంతేకాకుండా రియాల్టీ కి దగ్గరగా ఉండేటట్టు జాగ్రత్తలు తీసుకొని నిర్మిస్తున్నారు ప్రతి ఒక్క సెట్ ని. అయితే దేవర సినిమాకి మొదటి దగ్గర నుంచి సముద్రం అలాగే కొండలు వీటికి సంబంధించిన సెట్స్ క్రియేట్ చేయడం జరిగింది హైదరాబాదులో.
అయితే ఇప్పుడు ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలతో పాటు సెంటిమెంట్ కూడా కీలకంగా ఉండబోతుంది అంట..ఇదో మత్సకార గ్రామం చుట్టూ తిరిగే కథ కాబట్టి దీనికి ఇప్పుడు సముద్రపు బీచ్ లాంటి ఒకటి అవసరమైంది.. దీనికిగాను మేకర్స్ దాదాపు 5 కోట్ల వరకు ఖర్చు చేసి బీచ్ సెట్ ని నిర్మించారంట.. అంతేకాకుండా దీనికి రియాల్టీగా ఉండటం కోసం.. కర్ణాటక అలాగే ఇతర ప్రాంతాల నుండి దీనికి సంబంధించిన ఇసుక అలాగే ఇసుక దిమ్మెలను మేకర్స్ తెప్పించినట్టు తెలుస్తుంది.
ఆర్ట్-ఎఫెక్టివ్‌నెస్- రియలిస్టిక్ లుక్-సెట్‌లో ఒక చివర నీటి తరంగాలను అనుకరించే విధానం చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుందిట. సాబు సిరిల్ ఆధ్వర్యంలో ఈ సెట్ నిర్మాణం జరిగింది. ప్రస్తుతం దేవర షూటింగు హైదరాబాదులోని శంషాబాద్ లో ఈ సెట్ నిర్మించడం జరిగింది. అలాగే ఈ నిర్మించిన సెట్ లో తీయిబోయే కీలకమైన సెంటిమెంట్ సన్నివేశాలలో ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉంటుందని సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం.
ఈ సినిమాకి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కూడా ఈ సినిమా గురించి చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తుంది అలాగే ఏప్రిల్ నాలుగున ఈ సినిమాని అన్ని రకాలుగా విడుదల చేయడానికి కొరటాల శివ సిద్ధం చేస్తున్నారు.. ప్రస్తుతానికి రిలీజ్ డేట్ లో ఎటువంటి మార్పులు లేవు..