హంట్ మూవీ రివ్యూ రేటింగ్ : 2.5/5
నటీనటులు: సుధీర్ బాబు, శ్రీకాంత్ మేక, భరత్ నివాస్, మైమ్ గోపి, కబీర్ సింగ్, రవివర్మ
దర్శకుడు : మహేష్ సూరపనేని
నిర్మాతలు: వి ఆనంద ప్రసాద్
సంగీత దర్శకులు: జిబ్రాన్
సినిమాటోగ్రఫీ: అరుల్ విన్సెంట్
ఎడిటర్: ప్రవీణ్ పూడి
Hunt Movie Review In Telugu: మహేష్ సూరపనేని దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ త్రిల్లర్ మూవీ హంట్. ఈ సినిమాల్లో సుధీర్ బాబు హీరోగా చేయగా శ్రీకాంత్, ప్రేమిస్తే భరత్ ప్రధాన పాత్రల్లో నటించారు. హంట్ మూవీ ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేయడం జరిగింది. మరి సినిమా ఎలా ఉందో చూద్దాం పదండి.
Hunt Movie Review In Telugu: స్టోరీ: ఐపీఎస్ ఆఫీసర్ ఆర్యన్ (భరత్) హత్యకు గురవుతాడు. అతడిని హత్య చేసింది ఎవరో కనిపెడతాడు అసిస్టెంట్ పోలీస్ కమీషనర్ అర్జున్ ( సుధీర్‌బాబు). ఆ వివరాల్ని కమీషనర్ మోహన్ భార్గవ్ కు (శ్రీకాంత్)చెబుతున్న సమయంలోనే అతడికి యాక్సిడెంట్ అవుతుంది.
ఆ ప్రమాదంలో అర్జున్ గతాన్ని మర్చిపోతాడు. అర్జున్ తెలివితేటలపై ఉన్న నమ్మకంతో అతడికే ఆర్యన్ మర్డర్ కేసును అప్పగిస్తాడు మోహన్ భార్గవ్. గతాన్ని మర్చిపోయిన అర్జున్ ఆ మర్డర్ కేసు మిస్టరీని ఎలా సాల్వ్ చేశాడు? అర్యన్‌ను చంపింది ఎవరు? అర్జున్‌కు, ఆర్యన్‌కు మధ్య ఎలాంటి అనుబంధం ఉంది? అన్నదే హంట్ సినిమా కథ.
Hunt Movie Review In Telugu: సాంకేతిక విభాగం: దర్శకుడు మహేష్ మంచి క్రైమ్ థ్రిల్లర్ కి సంబంధించి గుడ్ పాయింట్ ను తీసుకున్నా.. స్క్రీన్ ప్లే ను మాత్రం బలంగా రాసుకోలేకపోయారు. సుధీర్ బాబు ప్లాష్ బ్యాక్ ట్రాక్ ఇంకొంచెం బెటర్ గా రాసుకొని ఉండాల్సింది. అరుల్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ బాగుంది. మూవీ ఓపెనింగ్ దృశ్యాలతో పాటు సెకెండ్ హాఫ్ లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలను కెమెరామెన్ అరుల్ విన్సెంట్ చాలా నేచురల్ గా చూపించారు. జిబ్రాన్ సంగీతం బాగుంది. నేపథ్య సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.
తీర్పు: సుధీర్ బాబుకు చాలా స్కోప్ ఉన్న పాత్రలో నటించడం జరిగింది. తన బాడీ లాంగ్వేజ్ అలాగే ఫైట్ చేయటంలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. సుధీర్ బాబు ఈ సినిమాలో తన రోల్ కు సంబంధించి పూర్తిగా న్యాయం చేశాడని చెప్పాలి.
శ్రేయోభిలాషిగా, స్నేహితుడిగా శ్రీకాంత్ ఓకే. భరత్ (ప్రేమిస్తే ఫేమ్) పాత్ర అంతలా ఆకట్టుకోలేకపోయింది. కథలో స్కోప్ ఉన్నప్పటికీ దర్శకుడు కాదని సరిగ్గా చూపించలేకపోయాడు. దర్శకుడు మహేష్ మంచి క్రైమ్ థ్రిల్లర్ కి సంబంధించి గుడ్ పాయింట్ ను తీసుకున్నా.. స్క్రీన్ ప్లే ను మాత్రం బలంగా రాసుకోలేకపోయారు.
సినిమా ఫస్ట్ హాఫ్ చాలా క్లీన్ గా అలాగే ఇంటెన్స్ గా తీయడం జరిగింది. కానీ సెకండాఫ్ వచ్చే టయానికి దర్శకుడు తన ప్రతిపాని చూపించలేకపోయాడు. జిబ్రాన్ సంగీతం బాగుంది. నేపథ్య సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ కూడా ఆకట్టుకుంది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సినిమాలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పర్వాలేదు. అయితే, హీరో ప్లాష్ బ్యాక్ ట్రాక్, కొన్ని కీలక సన్నివేశాలు మరియు హీరో మోటివ్ ఇంకా బెటర్ గా రాసుకోవాల్సింది. మొత్తమ్మీద ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ లో కొన్ని అంశాలు బాగున్నాయి. కానీ సినిమా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు.