‘హుషారు’ ఫేమ్ దినేష్ తేజ్ హీరోగా కొత్త సినిమా

husharu fame dinesh tej new movie shooting finished

‘హుషారు’ (Husharu) ఫేమ్ దినేష్ తేజ్ (Dinesh Tej) హీరోగా కొత్తూరి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 1 గా కొత్త సినిమా రాబోతోంది. శ్వేతా అవస్తీ (Shweta Avasthi) హీరోయిన్‌గా నటిస్తోంది. కామెడీ, లవ్, ఎమోషన్స్‌తో కూడిన కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా అతిత్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి వెంకటేష్ కొత్తూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పవన్ కుమార్.కె దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ఫినిష్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా టైటిల్ డిసైడ్ చేయలేదు.

ఈ సందర్భంగా దర్శకుడు పవన్ కుమార్.కె మాట్లాడుతూ… ”మా చిత్ర షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్న మా సినిమా ఫస్ట్‌లుక్ త్వరలో విడుదల చేస్తున్నాం. హీరో దినేష్, హీరోయిన్ శ్వేతా అవస్తి బాగా నటించారు. రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన మా సినిమా ఫీల్ గుడ్ సినిమాగా అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుంది” అని తెలిపారు. ఈ చిత్రంలో సంజయ్ స్వరూప్, గురు రాజ్, బిందు, సంధ్య జనక్, మని, కాటలిన్, శశాంక్, నానాజీ ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

husharu fame dinesh tej new movie shooting finished

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *