సల్మాన్ సినిమాలు కూడా వదులుకున్న ఇలియానా..!

195
Why ileana d'cruz Rejected Salman khan Movie
Why ileana d'cruz Rejected Salman khan Movie

గోవా బ్యూటీ ఇలియానా తన బాలీవుడ్ సినిమా పాగల్ పంతీ సినిమా ప్రమోషన్స్ లో మనకు తెలియని ఎన్నో విషయాలను చెప్పుకుంటూ వచ్చింది. ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా టాలీవుడ్ లో స్టార్డమ్ ను ఎంజాయ్ చేసింది ఇలియానా. బాలీవుడ్ లో కూడా మంచి హిట్స్ లో నటించింది. కానీ ఎక్కువ సినిమాల్లో మాత్రం నటించలేకపోయింది.

ముఖ్యంగా కొన్ని కారణాల వలన సల్మాన్ ఖాన్ సినిమాలో కూడా అవకాశాన్ని మిస్ చేసుకుంది ఈ గోవా బ్యూటీ. సల్మాన్ ఖాన్ ‘వాంటెడ్’ సినిమా.. అదేనండీ తెలుగులో ‘పోకిరీ’ బాలీవుడ్ లో మంచి హిట్ అయింది.. అంతేకాదు సల్మాన్ ఖాన్ కెరీర్ కు కూడా పెద్ద ప్లస్ గా మారింది. ఆ సినిమా రీమేక్ లో నటించమని అడిగే సమయంలో ఇలియానా ఎగ్జామ్స్ రాస్తుండడంతో అవకాశాన్ని వదులుకుంది. ఆ తర్వాత సల్మాన్ మరో సినిమా ‘కిక్’ సమయంలో మరో సినిమాకు కమిట్ మెంట్ ఇవ్వడంతో.. ఆ సినిమాను కూడా చేయలేకపోయింది ఇలియానా. సల్మాన్ ఖాన్ తో ఒక్క సినిమాలో నటించి.. ఎన్నో ఏళ్లుగా బాలీవుడ్ లో అలా గడిపేస్తూ ఉన్న హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. ఇప్పటికే రెండు మంచి ఛాన్స్ లు కోల్పోయిన ఇలియానాకు సల్మాన్ మరో అవకాశం ఇస్తాడో.. లేదో చూడాలి.

ఇక గోవా భామ ఇలియానా కూడా తన జీవితంలో ఎదుర్కొన్న ఎన్నో ఆటుపోట్లను కూడా ‘పాగల్ పంతీ’ సినిమా ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చింది. కొన్నేళ్ల క్రితం ఇలియానా ఆస్ట్రేలియా కు చెందిన ఆండ్రూ అనే ఫోటో గ్రాఫర్ ప్రేమలో పడింది. కానీ ఏమైందో ఏమో.. వారి ప్రేమకు ఫుల్ స్టాప్ పడింది. ఈ గాయం ఇలియానా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినా ఇలియానా రోజుకు 12 మాత్రలు వేసుకునేదట.. ఇక ఆమె శరీరంలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. విపరీతమైన లావు పెరిపోయింది.. దీంతో జిమ్ కి వెళ్ళాలి అన్నా.. కెమెరాలు ఆమెను ఎక్కడ వెంటాడుతాయో అని భయపడిపోయేదట. ఇక ఎలాగోలా ధైర్యం చేసుకుని రీఎంట్రీ చేశానని ఆమె చెప్పుకొచ్చింది. ఇలియానా ఇటీవలే తెలుగులో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాలో నటించింది. ఆమె నటించిన పాగల్ పంతీ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది.