ఆ రీమేక్ లో మెగాస్టార్ కు జోడీగా ఇలియానా.?

0
1251
Ileana D'cruz Romance with Chiranjeevi in Lucifer Remake

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలను పట్టాలెక్కేస్తున్నాడు. ప్రస్తుతం ఆచార్య సినిమాపూర్తి చేసే పనిలో ఉన్నాడు చిరంజీవి. ఈ సినిమా పూర్తయిన వెంటనే మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘వేదాళం’ సినిమా రీమేక్ లో నటిస్తున్నాడు చిరు. దీనితోపాటు మలయాళం సూపర్ హిట్ సినిమా ‘లూసిఫర్’ సినిమాను కూడా రీమేక్ చేయబోతున్నాడు. ఈ సినిమాకి తమిళ దర్శకుడు మోహన్ రాజాని రంగంలోకి దించారు. ఇంతకముందు సుజీత్, వి.వి.వినాయక్ ఈ ప్రాజెక్ట్ కోసం పని చేశారు కానీ చిరుని మెప్పించలేకపోయాయి.

అయితే ఈ సినిమాను డైరెక్ట్ చేయబోయే దర్శకుడి పై చాలా చర్చే జరిగింది. చాలా మంది పేర్లు కూడా వినిపించాయి. మొదట్లో యంగ్ డైరెక్టర్ సుజీత్ ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడని ప్రకటించారు. ఆ తరవాత అనుకోకుండా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. ఆతర్వాత యాక్షన్ డైరెక్టర్ వివి వినాయక్ ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారని అన్నారు. ఇప్పుడు ఆయన కూడా ఈ సినిమానుంచి తప్పుకున్నాడు. ఇక ఈ సినిమా చివరకు స్పెషలిస్టు మోహన్ రాజా చేతిలో పడింది. ఒరిజినల్ వెర్షన్ తో పోలిస్తే కాస్త వినోదాత్మకంగా, కమర్షియల్ అంశాల కలయికతో సినిమా ఉండాలని చిరు కోరుకుంటున్నారు. ఆయన కోరినట్లుగానే మోహన్ రాజా స్క్రిప్ట్ సిద్ధం చేశారు అని తెలుస్తుంది..

ఇప్పుడు ఈ సినిమాలో చిరంజీవి సరసన నటించే హీరోయిన్ గురించి చర్చ మొదలైంది.  తాజాగా గోవా బ్యూటీ ఇలియానా పేరు వినిపిస్తుంది. ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓవెలుగు వెలిగిన ఈ అమ్మడు. తర్వాత బాలీవుడ్ కు చెక్కేసింది. తిరిగి టాలీవుడ్ లోకి రవితేజ నటించిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చినా ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. దాంతో మళ్ళీ తెలుగు సినిమా వైపు చూడలేదు ఇలియానా. కానీ ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.