మనసును హత్తుకునేలా ‘లవ్‌స్టోరీ’ ట్రైలర్‌

0
1686
impressing Naga Chaitanya and sai pallavi Love Story Trailer

Love Story Trailer: నాగ చైతన్య, సాయిపల్లవి నటించిన ‘లవ్ స్టోరీ’ చిత్రం ఈ నెల 24న విడుదల కానున్న విషయం తెలిసిందే.. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్లకు శ్రీకారం చుట్టారు మేకర్స్. ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోన్న ‘Love Story’ ట్రైలర్‌ వచ్చేసింది. ఈ చిత్రానికి ఫీల్‌గుడ్‌ డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించారు.

ఈ ట్రైలర్ సన్నివేశాలతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. శేఖర్ కమ్ముల మార్క్ సినిమా అయినప్పటికీ ట్రైలర్ మాత్రం చాలా ఫ్రెష్ గా మలిచారు. ఇందులో చైతన్య-సాయిపల్లవి మధ్య వచ్చే సన్నివేశాలు మనసును హత్తుకునేలా ఉన్నాయి.

తెలంగాణ స్టైల్లోని వారి సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘బిజినెస్‌లు చేయలేం.. మనతోని కాదని.. మాటలు అంటున్నరే’ అంటూ సాగే సంభాషణలు సినిమాలో నాగచైతన్య పాత్ర తెలియజేసేలా ఉన్నాయి. రేవంత్, మౌనిక పాత్రలు ఆకట్టుకొనేలా వున్నాయి. మరి ముఖ్యగా అన్నిరకాల భావోద్యేగాలు, హావభావాలతో ట్రైలర్ డిఫరెంట్ గా సాగింది.

impressing Naga Chaitanya and sai pallavi Love Story Trailer

లైఫ్‌‌లో సెటిల్ కావడం కోసం ఇటు మిడిల్ క్లాస్ కుర్రాడు (రేవంత్) నాగ చైతన్య, అటు (మౌనిక) సాయిపల్లవి పడే కష్టాలు చాలా సహజంగా చూపించారు. శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌పై నారాయణ్‌ దాస్‌, రామ్మోహన్‌రావు ఈ చిత్రాన్ని నిర్మించారు.