Homeట్రెండింగ్ఇండియన్2 - RC15 కోసం శంకర్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్..!!

ఇండియన్2 – RC15 కోసం శంకర్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్..!!

Director Shankar big plan to release dates for Indian 2 and RC15. Kamal haasan Indian 2 release date, Ram Charan RC15 Release Date, Shooting updates

Indian2 and RC15 Release Dates: శంకర్ (Shankar) ప్రస్తుతం కమలహాసన్ ఇండియన్2 అలాగే రామ్ చరణ్ RC15 చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాల్లో షూటింగు చివరి దశలో ఉన్నాయి. దర్శకుడు శంకర అంటేనే భారీ చెట్లు అలాగే యాక్షన్ సీక్వెన్స్ లు దాని తగ్గట్టు భారీ బడ్జెట్ ఉండాల్సిందే. ఈ రెండు ప్రాజెక్టుల మీద ఫ్యాన్స్ కి అలాగే మూవీ లవర్స్ కి భారీ అంచనాలు ఉన్నాయి.

Indian2 and RC15 Release Dates: శంకర్ ఏకకాలంలో ఇండియన్2 మరియు RC15లో పని చేస్తున్నాడు మరియు ఈ రెండు భారీ ప్రాజెక్ట్‌లను ఒకేసారి ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలని సినీ ప్రేమికులు మరియు పరిశ్రమ లోపలివారు ఆసక్తిగా ఉన్నారు. దర్శకుడు శంకర్ (Shankar) ఈ రెండు సినిమాలను విడుదల చేయడానికి మైండ్ బ్లోయింగ్ ప్లాన్ ఒకటి రెడీ చేసారంట.

అందుతున్న సమాచారం మేరకు, శంకర్ (Shankar) ఇండియన్ 2ని (Indian 2 Release Date) ఈ ఏడాది దీపావళికి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారంట. కమలహాసన్ (Kamal Haasan) అలాగే కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా చివరి షూటింగ్ షెడ్యూల్ కోసం టీమ్ సౌతాఫ్రికా వెళ్లింది. ఈ షెడ్యూల్ కంప్లీట్ కాగానే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ బిగించేసి దీపావళికి విడుదల చేసే ప్లాన్లు మేకర్స్ కూడా ఉన్నారని తెలుస్తుంది.

ఇక రామ్ చరణ్ (Ram Charan) అలాగే కైరా అద్వానీ రెండవసారి కలిసి నటిస్తున్న RC15 2024 సంక్రాంతికి విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా టైటిల్ టీజర్‌ను ఈ నెల చివర్లో రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజున విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నట్టు ఫిలింనగర్ లో టాక్ వినబడుతుంది.

ఇండియన్ 2 – RC15 కంటే ముందు ప్రారంభమైనప్పటికీ, షూటింగ్ సెట్లో జరిగిన ప్రమాదాలు అలాగే ప్రొడ్యూసర్స్ తో వచ్చిన ఇష్యూస్ వల్ల ఈ సినిమా ఆలస్యం జరిగింది. చివరకు అందరూ ఒక మాట మీదకు వచ్చి ఈ సినిమా షూటింగ్ని మళ్లీ మొదలుపెట్టడం కూడా మనకు తెలిసిన విషయమే.

మరోవైపు RC15 సినిమా షూటింగు డీసెంట్ స్పీడ్‌తో సాగుతోంది మరియు కొన్ని షూటింగ్ షెడ్యూల్‌లను పూర్తి చేసుకుంది. కానీ, శంకర్ , ఒకేసారి రెండు భారీ ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్న రామ్ చరణ్ షూటింగ్‌పైనా ప్రభావం లేదా సినిమా అవుట్పుట్ ఎలా వచ్చింది అనేది మరికొన్ని రోజులు పోతే గాని తెలియదు.

- Advertisement -

Director Shankar big plan to release dates for Indian 2 and RC15. Kamal Haasan Indian 2 release date, Ram Charan RC15 Release Date, Shooting updates.

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY