మహేష్, రాజమౌళి సినిమా హీరోయిన్ పై ఇంట్రెస్టింగ్ బజ్

0
3180
Interesting buzz on Mahesh babu, Rajamouli movie heroine
Interesting buzz on Mahesh babu, Rajamouli movie heroine

Mahesh Babu, Rajamouli: సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే రాజమౌళి సినిమా గురించి ఎప్పటి నుంచో ఫ్యాన్స్ అందరూ ఎదురుచూస్తున్నారు. అనుకున్న విధంగానే మహేష్ బాబు అలాగే రాజమౌళి సినిమా అధికారికంగా ప్రకటించినప్పటికీ, వివిధ ఇంటర్వ్యూస్ లో ఇద్దరూ చెప్పటం జరిగింది.

ప్రస్తుతం మహేష్ బాబు (Mahesh babu) సర్కారు వారి పాట సినిమా షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. అలాగే రాజమౌళి (Rajamouli) కూడా RRR మూవీ కంప్లీట్ చేసి ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. మహేష్ బాబు ఆల్ రెడీ త్రివిక్రమ్ సినిమాకి SSMB28 కమిట్ మెంట్ ఇచ్చారు అలాగే ఈ సినిమాని అఫీషియల్ గా ఎనౌన్స్ చేయడం కూడా జరిగింది.

ఈపుడు సోషల్ మీడియాలో మహేష్ బాబు రాజమౌళి సినిమా పై ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. ప్యాన్‌ ఇండియా లెవల్లో స్టార్ట్ చేసే ఈ సినిమాలో హీరోయిన్ పై వివిధ వార్తలు వస్తున్నాయి. సినీ వర్గాల కథనం మేరకు ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ దీపికా పదుకొనె (deepika padukone) హీరోయిన్‌గా నటించే అవకాశం ఉందని అంటున్నారు.

Interesting buzz on Mahesh babu, Rajamouli movie heroine
Interesting buzz on Mahesh babu, Rajamouli movie heroine

అలాగే సమంత (Samantha) కూడా హీరోయిన్గా ప్రచారంలో ఉంది. సమంత, మహేష్ బాబుతో రెండు సినిమాలు చేసింది. ఇప్పుడు ఆమె బాలీవుడ్లో కూడా సినిమాలు చేయడానికి రెడీగా ఉంది. అందుకు కారణాలు లేకపోలేదు. దీపికా పదుకొనె బేసిగ్గా దక్షిణాది అమ్మాయి. మన ఫీచర్స్‌ ఉండటంతో మన ప్రేక్షకులకు కనెక్ట్‌ అవుతుంది.

అలాగే ఈ సినిమాని ప్యాన్‌ ఇండియా లెవెల్ లో చేయాలని చూస్తున్న రాజమౌళికి దీపిక కూడా ఓ ప్లస్ పాయింట్ అవుతుందని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమో..? ఎవరు హీరోయిన్ గా ఫిక్స్ అవుతారో వేచి చూడాల్సిందే..

 

Web Title: Interesting buzz on Mahesh babu, Rajamouli movie heroine, Samantha and deepika padukone heroines for SSMB29.

Previous articlePhotos: Chiranjeevi blesses Kartikeya and Lohitha at their wedding
Next articleభీమ్లా నాయక్ ని పర్సనల్ గా కలుస్తున్న RRR డైరెక్టర్