Pawan Kalyan PKSDT Title: టాలెంటెడ్ యాక్టర్ అలాగే దర్శకుడు సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా గాను PKSDT టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగు హైదరాబాదు లొకేషన్స్ లో శరవేగంగా జరుగుతుంది. సోషల్ మీడియాలో PKSDT title ఇదే అంటూ ప్రచారం జరుగుతుంది.
Pawan Kalyan PKSDT Title: పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు సంబంధించిన షూటింగు కంప్లీట్ చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) అలాగే మిగతా నటీనటుల మీద షూటింగు జరుపుకుంటున్నారు. PKSDT సినిమాని జులై 28న విడుదల చేయుటకు మేకర్స్ ప్రకటించడం జరిగింది. దీనితో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అలాగే ఫాలోవర్స్ PKSDT title గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు.
అయితే తెలుస్తున్న సమాచారం మేరకు ఈ సినిమా గాను మూడు టైటిల్స్ ని (title) పవన్ కళ్యాణ్ ముందు పెట్టారంట. అవి ’గోపాల కృష్ణుడు’,’దేవుడే దిగి వచ్చినా’ మరియు ‘నేనే కాలాన్ని’ వీటిలో ఏదో ఒక టైటిల్ ని సెలెక్ట్ చేసుకుందామని మేకర్స్ అలాగే దర్శకుడు భావించారంట. అయితే పవన్ కళ్యాణ్ ఆలోచన మేరకు ఈ సినిమాకి పరదేశ ప్రయాణం అన్నయ్య టైటిల్ బాగుంటుందని మేకర్స్ కి సూచించడం జరిగిందంట.
అయితే ఈ PKSDT టైటిల్ సోషల్ మీడియాలో వైరల్ కాక.. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్స్ చాలానే నిరాశ చెందినట్టు తెలుస్తుంది. ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోకి ఇలాంటి టైట్ ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. అలాగే ఒకపక్క ఈ సినిమా రీమేక్ కాగా ఇప్పుడు టైటిల్ విషయంలో కూడా ఫాన్స్ నిరాశని వ్యక్తం చేయటంతో..PKSDT సినిమాకి మాటలు అలాగే స్క్రీన్ ప్లే అందిస్తున్న త్రివిక్రమ్ ఈ సినిమా కోసమని ఒక అద్భుతమైన టైటిల్ ని రెడీ చేసినట్టు సమాచారం తెలుస్తుంది. మరి దర్శకుడు అలాగే మేకర్స్ ఏ టైటిల్ ని ఖరారు చేస్తారో చూడాలి.