ప్రభాస్ ‘ఆదిపురుష్’ నుండి మరో అప్‌డేట్.

0
397
Interesting Update From Prabhas's Adipurush Movie

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) మంచి జోరు మీద ఉన్నారు. ‘సాహో’ తరవాత ప్రభాస్ నుంచి మరో సినిమా వెండితెరపై దర్శనం ఇవ్వనప్పటికీ వరుస ప్రాజెక్టులను ప్రకటిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు ఈ టాలీవుడ్ రెబల్ స్టార్. ఇప్పటికే ఆయన ‘రాధే శ్యామ్’ సినిమా చేస్తుండగా.. ప్రతిష్టాత్మక వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో మరో సినిమాను ఆ మధ్య ప్రకటించారు. ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇది కూడా పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుంది.

ఇదిలా ఉంటే, ఆగస్టు 18న ప్రభాస్ మరో భారీ చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి ‘ఆదిపురుష్’ (Adipurush) అని టైటిల్ పెట్టారు. అంతేకాదు, టైటిల్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.ఈ చిత్రం గురించి ఈరోజు ఒక కీలకమైన అప్ డేట్ రాబోతోంది. ఈ విషయాన్ని హీరో ప్రభాస్ తో పాటు, చిత్ర దర్శకుడు ఓం రౌత్ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు.’7000 సంవత్సరాల క్రితం ప్రపంచంలోనే అత్యంత తెలివైన రాక్షసుడు ఒకడు ఉండేవాడు.. రేపు ఉదయం 7.11 నిమిషాలకు’ అంటూ పోస్ట్ పెట్టారు. దీనిని బట్టి ఈ చిత్రంలో నటించే విలన్ పాత్రధారి పేరును ప్రకటిస్తారని అంతా అనుకుంటున్నారు. మరి ఎం అప్డేట్ ఇవ్వబోతున్నారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here