సుకుమార్ క్రేజీ ప్లాన్…’పుష్ప’ మూవీలో తొమ్మిది మంది విలన్లట ?

0
1129
Interesting Update from sukumar allu arjun Nine Villains In Pushpa Movie

అల్లు అర్జున్, సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప’. లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ మరియు ముత్యంశెట్టి మీడియా బ్యానర్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. షూటింగ్ సందర్భంగా బన్నీ గెటప్‌కు సంబంధించి ఇటీవల లీకైన ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సినిమాకు సంబంధించి ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి బయటికొచ్చింది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం సుక్కు టీమ్ ఇప్పటికే విలన్ రోల్ కోసం కొందరిని ఫైనలైజ్ చేశారని తెలుస్తోంది.

‘పుష్ప’ సినిమాలో ఏకంగా తొమ్మిది మంది విలన్లను సెట్ చేస్తున్నాడట డైరెక్టర్ సుకుమార్. ఇప్పటివరకు అనేక సినిమాల్లో విలన్లుగా ముఖేశ్ రుషి, రావు రమేష్‌లతో పాటు ప్రముఖ విలన్లు ఇందులో కనిపించనున్నారట. ఈ తొమ్మిది మందిలో సునీల్‌కి కూడా రోల్ దొరికినట్లు సమాచారం. ‘డిస్కోరాజా’ ‘కలర్ ఫోటో’ చిత్రాల్లో విలన్ వేషాలు వేసిన సునీల్.. ఇప్పుడు ‘పుష్ప’ లో క్యారెక్టర్ నచ్చడంతో ఓకే చేసాడట. అలానే మెయిన్ విలన్ ని కూడా ఎంపిక చేసే పనిలో సుకుమార్ బిజీగా ఉన్నారట. త్వరలోనే ప్రధాన నటీనటులను ‘పుష్ప’ టీమ్ అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది.

పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ‘పుష్ప’ కోసం సుకుమార్‌ భారీగానే ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఇందులో రష్మిక మందన్నా బన్నీ కి జోడీగా నటిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా మన్యం ప్రాంతం మారేడుమిల్లి అభయారణ్యంలో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here