intresting update on ram- trivikram srinivas upcoming movie

Ram Pothineni: Trivikram Srinivas: ఇస్మార్ట్ శంక‌ర్ చిత్రంతో మ‌ళ్ళీ ఫాంలోకి వ‌చ్చిన హీరో రామ్ తాజాగా కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో రెడ్ అనే సినిమా పూర్తి చేశాడు. ఈ చిత్రాన్ని సంక్రాంతి బ‌రిలో నిల‌ప‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఇక కొద్ది రోజులుగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రామ్ న‌టించ‌నున్నాడ‌ని జోరుగా ప్రచారం జ‌రుగుతుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో ఆయన తదుపరి సినిమా ఉండనుందని తెలిసినప్పటికీ RRR ఆలస్యమవుతుండటంతో ఆ లోగా ఎనర్జిటిక్ స్టార్ రామ్‌తో మూవీ ఫినిష్ చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నట్లు టాక్.

రీసెంట్ గా రామ్ త‌న సోష‌ల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేశాయి. ఇందులో చాలా కూల్‌గా క‌నిపిస్తున్నాడు. లైట్ గ‌డ్డం, వైట్ ష‌ర్ట్‌, డార్క్ క‌ల‌ర్ ప్యాంట్ విత్ మ్యాచింగ్‌ ట్రౌజ‌ర్స్ లో ఓ చేతిలో కంప్యూట‌ర్, మ‌రో చేతిలో పెన్ను ప‌ట్టుకుని ఆలోచిస్తున్న‌ట్టుగా ఉన్న స్టిల్స్‌ని త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా, ఇవి ఫుల్ వైర‌ల్ అవుతున్నాయి. హీరో రామ్ రిక్వెస్ట్ మేరకు త్రివిక్ర‌మ్ ఓ కథ సిద్ధం చేశారని సమాచారం. జులాయి మూవీ టైప్‌లో కథ కావాలని రామ్ కోరారట. అయితే ఈ కథ కోసం త్రివిక్రమ్ ఏకంగా 10 కోట్లు తీసుకుంటున్నాడని తెలుస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీనిపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న ఎప్పుడు వ‌స్తుందా అని ఫ్యాన్స్ కుతూహలంగా ఎదురు చూస్తున్నారు.