Homeసినిమా వార్తలుటైగర్ నాగేశ్వరరావు నిర్మాత ఆఫీస్ పై ఐటీ దాడులు...కారణాలు ఇవేనా..?

టైగర్ నాగేశ్వరరావు నిర్మాత ఆఫీస్ పై ఐటీ దాడులు…కారణాలు ఇవేనా..?

IT/GST Rides on Abhishek Agarwal Arts Banner, Ravi Teja Tiger Nageswara rao movie producer Abhishek Agarwal IT Rides,

IT/GST Rides on Abhishek Agarwal Arts Banner, Ravi Teja Tiger Nageswara rao movie producer Abhishek Agarwal IT Rides, IT Rides on Tollywood producer office.

మాస్ మహారాజా రవితేజ రాబోతున్న సినిమా టైగర్ నాగేశ్వరరావు ప్రస్తుతం ప్రమోషన్ లో భాగంగా వివిధ ఇంటర్వ్యూలు అలాగే ప్రముఖ టాక్ షోలో పాల్గొంటున్నారు టీం. అక్టోబర్ 19 విడుదల అవుతున్న ఈ సినిమాని అభిషేక్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ అయిన అభిషేక్ అగర్వాల్ నిర్మించడం జరిగింది. అయితే ఈరోజు ఐటీ జిఎస్టికి సంబంధించిన అధికారులు నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఆఫీస్ పైన దాడులు జరపటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

అయితే ఐటి దాడులు ఇండస్ట్రీలో సర్వసాధారణం.. మునుపు ఇలాగే మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ మీద అలాగే మిగతా ప్రముఖుల ఆఫీస్ మీద కూడా ఐటి అలాగే జీఎస్టీ దాడులు అనేవి జరిగాయి. అయితే ఇక్కడ అభిషేక్ అగర్వాల్ గత కొన్ని నెలలుగా తీస్తున్న ప్రతి ఒక్క సినిమా బాక్సాఫీస్ వద్ద విజయాలుగా మారుతున్నాయి. దీనితో ఈ ఐటీ దాడులు జరిగాయి అంటూ టాక్ అయితే వినపడుతుంది. అలాగే రైడ్స్ సినిమాకు సంబంధించా లేక అభిషేక్ అగర్వాల్ కు సంబంధించిన చిట్స్ బిజినెస్ గురించా అనే చర్చ కూడా ఉంది

ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించడమే కాకుండా కలెక్షన్స్ వర్షం కూడా కురిపించాయి అలాగే ఈ రెండు సినిమాలు కూడా అభిషేక్ అగర్వాల్ బ్యానర్ నుండి వచ్చినవే దానితోపాటు ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు సినిమా కూడా భారీ విజయాన్ని సాధిస్తుంది అంటూ ఇన్సైడ్ టాక్ అయితే వినపడుతుంది. అయితే అభిషేక్ అగర్వాల్ ఆఫీస్ పై జరిగిన ఈ ఐటీ రైట్స్/జీఎస్టీ రైట్ పై మరికొన్ని వివరాలు తెలియాల్సి ఉంది..