సోనూసూద్ నివాసంలో ఐటీ సోదాలు..!

0
62
IT Raid at Bollywood Actor Sonu Sood House and Offices

Sonu Sood IT Raids: సోనూసూద్‌పై ఐటీ కన్నుపడింది. ముంబైలోని తన ఇల్లు, ఆఫీసు సహా 6 ప్రాంతాలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. పలు లెక్కల అవకతవకలపై ఆరా తీశారు. అయితే ఒక్కసారిగా ఐటీ అధికారులు దాడి చేయడంతో సోనూసూద్ షాక్ అయ్యారు.

అయితే ఢిల్లీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన పాఠశాల విద్యార్థుల మెంటార్ షిప్ ప్రోగ్రాంకు ఇటీవల అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం సోనూసూద్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించిన సంగతి తెలిసిందే.

సోనూసూద్ సినిమాలు, ఇతర ఆదాయ మార్గాలపైనా, చేస్తున్న ఖర్చుపైనా వివరాలను కోరినట్లు తెలుస్తోంది. కోవిడ్ టైమ్ లో సోనూసూద్ కార్మికులు, కూలీలు, పేదలకు అండగా నిలిచారు. ఎందరికో ఆర్థిక సాయం అందించారు.

IT Raid at Bollywood Actor Sonu Sood House and Offices

చాలామంది అతడి సాయంతో ఈ రోజు ఉపాధి పొందుతున్నారు. అతను రాజకీయాల్లో చేరడానికి ఎప్పుడూ మొగ్గు చూపలేదు కానీ ఆప్ అధినేతతో భేటీ తర్వాత ఊహాగానాలు చెలరేగాయి. వచ్చే ఏడాది పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని కొంతమంది భావిస్తున్నారు.

Previous articleబాలకృష్ణ #NBK107 సినిమా టైటిల్ పై గోపీచంద్ వివరణ..!
Next article“అఖండ” బీజీఎం వర్క్ స్టార్ట్ చేసిన తమన్..!