Itlu Maredumilli Prajaneekam Review & Rating: 2.75/5
నటీనటులు: అల్లరి నరేష్-ఆనంది-సంపత్-వెన్నెల కిషోర్-శ్రీతేజ్-కుమనన్ సేతురామన్-రఘుబాబు-ప్రవీణ్ తదితరులు
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
ఛాయాగ్రహణం: రామ్ రెడ్డి
మాటలు: అబ్బూరి రవి
నిర్మాణం: రాజేష్ దండ-జీ స్టూడియోస్
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఏఆర్ మోహన్
Itlu Maredumilli Prajaneekam Movie Review: ఒకప్పుడు అల్లరి నరేష్ కామెడీ మూవీస్ తో అందర్నీ అలరించే వాడు పోను పోను సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ కావటం లేదని నరేష్ స్టోరీ ఎంచుకోవడంలో ఇప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకుంటున్నాడు. అల్లరి నరేష్ లేటెస్ట్ మూవీ ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ఈరోజు విడుదల కావటం జరిగింది. మరి ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం పదండి
కథ: తూర్పుగోదావరి మారేడుమిల్లి సంబంధించిన కథని నరేష్ ఎంచుకోవడం జరిగింది. శ్రీనివాస్ (అల్లరి నరేష్) ఒక ప్రభుత్వ పాఠశాలతో తెలుగు ఉపాధ్యాయుడు. ఎవరైనా కష్టంలో ఉంటే కదిలిపోయి సాయం చేసే మనస్తత్వం అతడిది. శ్రీనివాస్ ఎన్నికల విధుల్లో భాగంగా ఏజెన్సీ ప్రాంతం అయిన మారేడుమిల్లికి వెళ్లాల్సి వస్తుంది. సమాజానికి, కొండ వాసులకి సంబంధం తెగిపోయినట్టు ఒక తెగకు చెందిన వారిలా బతుకుతుంటారు.



మా ఊర్లో నివసిస్తున్న వారికి ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి సహాయం అందదు. ప్రభుత్వ అధికారులకు తమ గోడు పట్టని నేపథ్యంలో తాము ఎన్నికల్లో ఓటు వేయమని అక్కడి జనాలు భీష్మించుకుని కూర్చుంటారు. అక్కడి జనాలను మార్చి వారు ఎన్నికల్లో పాల్గొనేలా చేస్తాడు శ్రీనివాస్ (అల్లరి నరేష్).
కానీ ఓట్లు వేస్తే ఇన్నాళ్లు తమని పట్టించుకోని ఈ రాజకీయ నాయకులు ఇప్పుడు పట్టించుకుంటారా అని జనం ఆలోచిస్తారు. తమని పట్టించుకునేందుకు శ్రీనివాస్, ఏజెన్సీ వారితో ఏం పథకం వేశాడు. ఏజెన్సీ వారికి కావాల్సిన బడి, ఆసుపత్రి, వంతెన వంటి డిమాండ్లను నెరవేర్చేలా ప్రభుత్వ అధికారులని ఎలా మార్చాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


ప్లస్ లు:
కథ, కథనం, దర్శకత్వం
అల్లరి నరేష్, ఆనంది, ఏజెన్సీ వాసుల నటన
మైనస్ లు:
ప్రీ క్లైమాక్స్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
విశ్లేషణ: అభివృద్ధికి చాలా దూరంగా ఓ మారు మూల అటవీ ప్రాంతంలో ఉండే జనాలు.. తమ సమస్యల పోరాటం కోసం ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడి అండతో చేసే పోరాటం నేపథ్యంలో సినిమా తీశాడు. ఈ ప్లాట్ లైన్ చదవగానే ఇలాంటి సినిమాలు ఏం చూస్తాం.. ఈ రోజుల్లో ఇవేం నడుస్తాయి అనిపించొచ్చు.
కానీ ఒక కాజ్ నేపథ్యంలో సాగే సినిమానే అయినా.. ఎన్నో పరిమితులు ఉన్నా.. కథనాన్ని వీలైనంత ఆసక్తికరంగా నడిపిస్తూ.. అక్కడక్కడా వినోదాన్ని కూడా జోడిస్తూ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ చిత్రాన్ని జనరంజకంగానే తీర్చిదిద్దాడు దర్శకుడు. ప్రేక్షకులను ఈ చిత్రం సర్ప్రైజ్ చేయకపోవచ్చు.


అల్లరి నరేష్ నటన పరంగా చాలా బాగా చేశాడు. సినిమాలో తనకిచ్చిన పాత్రకి న్యాయం చేయడమే కాకుండా ఈ సినిమాలో తన ప్రతిభను కూడా చాటాడు. హీరోయిన్ గా నటించిన ఆనంది తన గ్లామర్ తో పాటు, తన సెటిల్డ్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంటుంది. కలెక్టర్ గా సంపత్ రాజ్, ఇంగ్లీష్ టీచర్ గా వెన్నెల కిషోర్ ఆకట్టుకున్నారు.
అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేశారు. కిషోర్-ప్రవీణ్ జోడీ రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో కామెడీ డోస్ ఇస్తూ ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా చూశారు. ఎన్నికల విషయంలో పూర్తి విముఖతతో ఉన్న జనాలను మోటివేట్ చేయడానికి హీరో చేసే ప్రయత్నాల నేపథ్యంలో కథ ముందుకు నడుస్తుంది.
దర్శకుడు ఏఆర్ మోహన్ మంచి స్టోరీ లైన్ తీసుకున్నారు. గిరిజనల జీవితాల్లోని సమస్యలను చూపించే ప్రయత్నం చేశారు. సంగీత దర్శకుడు అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను ఎంతో రియలిస్టిక్ గా చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు.



ఇంటర్వెల్ ముందు అల్లరి నరేష్ చేసే స్టంట్స్ ఆకట్టుకుంటాయి. నిడివి తక్కువే అయినా ఆ కాసేపు అల్లరి నరేష్ చేసే స్టంట్స్ బాగున్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తంగా మార్పు అనేది అటు రాజకీయ నాయకుల్లోనూ, ఇటు ప్రజల్లోనే కాదు ప్రభుత్వ అధికారుల్లో కూడా రావాలి అని దర్శకుడు చెప్పిన విధానం అందరికీ నచ్చుతుంది. ఓవరాల్ గా ఈ సినిమా అందరికీ బాగానే నచ్చుతుంది.