Prabhas Maruthi Movie Story: బాహుబలి తరువాత ప్రభాస్ నుంచి తిరిగి మరో భారీ హిట్ కోసం ప్రభాస్ తో పాటు అతని ఫాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. రాధే శ్యామ్ మరియు సాహో ఊహించినంత ఫలితాన్ని ఇవ్వకపోవడం కాస్త నిరాశకు గురిచేసిన ప్రస్తుతం ప్రభాస్ లైన్లో ఉన్న చిత్రాలపై మాత్రం బజ్ విపరీతంగా ఉంది. అందునా అతను మారుతి డైరెక్షన్లో నటిస్తున్న మూవీ గురించి ఎప్పటినుంచో ప్రేక్షకులలో ఉత్సుకత నెలకొని ఉంది.
Prabhas Maruthi Movie Story: ప్రభాస్ స్టైల్ ,క్యారెక్టరైజేషన్ కు ఫ్యాన్ వేసి విపరీతంగా ఉంది. అయితే మారుతి ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం గురించి ఇప్పటివరకు అధికారికంగా ప్రకటనే కాదు కదా చిన్న లీక్ కూడా లేకుండా సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ మూవీకి సంబంధించిన ఏ విషయం బయటకు రాకుండా మారుతి (Director Maruthi) తెగ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
అంతెందుకు మూవీ ఏ జోనర్ లో వస్తోంది అన్న విషయం కూడా ఇప్పటివరకు వెల్లడించకపోవడం విశేషం. మామూలుగా మారుతి హిట్ పాయింట్ కామెడీ, అయితే ఇప్పుడు ప్రభాస్తో చేస్తున్న ఈ చిత్రం కామెడీ, హార్రర్, థ్రిల్లర్ లేక యాక్షన్…. జోనర్ ఏది అన్న విషయం ఎవరికీ తెలియదు. అయితే ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చే న్యూస్ ని చిత్ర బృందం నుంచి ఒకరు లీక్ చేయడం జరిగింది.
రంగస్థలం మూవీ కి పని చేసిన మహేష్ (Jabardasth Mahesh), ఈ మూవీలో కూడా నటిస్తున్నారు. అతను రీసెంట్గా ఈ చిత్రానికి సంబంధించి కొన్ని విషయాలను వెల్లడించారు. మారుతి మూవీ అంటే కామెడీ కన్ఫామ్ అని…నెక్స్ట్ ప్రభాస్ మారుతి (Prabhas Maruthi) కాంబోలో వస్తున్న చిత్రంలో కూడా ట్రెండ్ అదే అని మహేష్ పేర్కొన్నారు. అతను చెప్పిన దాన్ని బట్టి రాబోయే ప్రభాస్ మూవీ మంచి కామెడీ జోనర్ అని అర్థం అవుతుంది.
ఇంతకుముందు మిస్టర్ పర్ఫెక్ట్ ,డార్లింగ్ వంటి మూవీస్ లాంటి హై ఎనర్జీ ఈ చిత్రంలో ప్రభాస్ క్యారెక్టర్ లో ఉంటుందని ఆయన అన్నడం విశేషం. అంతేకాకుండా నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ ప్రోగ్రామ్ ఇటీవల ప్రభాస్ ఏ లుక్ లో కనిపించాడు సినిమాలో ఇంచుమించు అదే లుక్ మెయింటైన్ చేయడం జరుగుతుందట. అయితే కాస్త స్టైలిష్ గా ప్రభాస్ కనిపిస్తాడని మహేష్ చెప్పాడు.
అంతేకాకుండా సెట్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభాస్ స్వయంగా తన ఇంటి నుంచి భోజనం తెప్పించి ఫుడ్ ఫెస్టివల్ రోజు నిర్వహిస్తున్నారని వివరించారు. మాటల మధ్య తనకు మటన్ ఇష్టమని చెప్పగానే మరుసటి రోజు ఓ పది రకాల మటన్ ఐటమ్స్ ప్రభాస్ తన కోసం తెప్పించారని ఆయన ప్రేమ చూసి తాను ఫిదా అయ్యానని మహేష్ అన్నారు. అంత మంచి మనిషి కాబట్టి అంత ఫాన్ ఫాలోయింగ్ ఉంది అని ప్రభాస్ ను ఎలా పొగిడాడు.