ఈటీవీకి బాబు సవాల్ `అదిరింది` గా

Jabardasth Nagababu Sensational Comments On zee telugu 'Adirindi' show
Jabardasth Nagababu Sensational Comments On zee telugu 'Adirindi' show

(Jabardasth Nagababu Sensational Comments On zee telugu ‘adirindi’ show)కార్పొరేట్‌ కంపెనీల జోక్యమో… మరొకటో… కామెడీ చేయాల్సిన వాళ్లు, నవ్వులు పంచాల్సిన వాళ్లు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఈటీవీలో వచ్చే ‘జబర్దస్త్‌’ , జీ తెలుగు ఛానల్‌లో వచ్చే ‘అదిరింది’ షోస్‌ మధ్య పోటీ తప్పేలా లేదు. రెండు రోజుల్లో నటరాజు నాగబాబు ఆలోచనా ధోరణి మారింది. ఎవరు ఎవరి షో టీఆర్పీకి దెబ్బ కొడతారనేది ఇప్పట్లో చెప్పడం తొందరపాటే. కానీ, జబర్దస్త్‌తో పోటీకి ఆయన సై అన్నారు. నాగబాబుతో పాటు జీ తెలుగు, ‘అదిరింది’ దర్శకులు నితిన్‌-భరత్‌ కూడా పోటీగా దిగాలని భావిస్తున్నట్టు ఉంది.

నాగబాబు ఇటీవల ఆ షో నుండి బయటకు వచ్చేసి.. జీ తెలుగులో ‘అదిరింది’ అనే కొత్త షోకి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. నాగబాబుతో పాటు ఆయన బ్యాచ్ చమ్మక్ చంద్ర, ఆర్పీ, ధనరాజ్, వేణులు అదిరింది షోకి టీం లీడర్స్‌గా ఉండగా.. జబర్దస్త్ షో నుండి ముందే బయటకు వచ్చేసిన నితిన్ భరత్‌లు అదిరింది షోని డైరెక్ట్ చేస్తున్నారు. బుల్లితెరపై `అదిరింది` షో నవ్వులు ప్రారంభమయ్యాయి. గత ఆదివారమే తొలి ఎపిసోడ్ ప్రారంభమైంది. ధన్ రాజ్, వేణు, ఆర్పీ, చంద్ర తమ స్కిట్స్‌తో ఆకట్టుకున్నారు. అదిరింది షో తొలి ఎపిసోడ్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని నిర్వాహకులు తెలిపారు. రానున్న రోజుల్లో మరింత ఎంటైర్‌టైన్ చేస్తామని.. తమను ఇలాగే ఆదరించాలని కోరుతున్నారు.

‘ఎవరి షోనూ ఎవరు దెబ్బ కొట్టలేదు. జబర్దస్త్‌ పాపులర్‌ కామెడీ షో. దాన్నుంచి బయటకొచ్చి ఎవరూ ఆ షోను దెబ్బ కొట్టేంత పరిస్థితి ఉండదు’ అని రెండు రోజుల క్రితం స్వంత యుట్యూబ్‌ ఛానల్‌ ‘మై షో నా ఇష్ట”లో నాగబాబు చెప్పారు. పైగా, ‘జబర్దస్త్‌’ గురు, శుక్రవారాల్లో రాత్రి 9.30కు టెలికాస్ట్‌ అవుతుంది. జీ తెలుగులో ‘అదిరింది’ టెలికాస్ట్‌ అయ్యేది ఆదివారం రాత్రి 9 గంటలకు. అందువల్ల, టీఆర్పీ రేటింగుల్లో తప్ప షోస్‌ మధ్య పోటీ ఉండదని భావించారంతా! అయితే… ‘అదిరింది’ ఫస్ట్‌ ఎపిసోడ్‌ టెలికాస్ట్‌ తర్వాత పరిస్థితులు మారాయి. ఆ షో టెలికాస్ట్‌ అవుతున్న సమయంలో ఈటీవీలో న్యూస్‌ బులిటెన్‌ తర్వాత ‘జబర్దస్త్‌’ స్కిట్స్‌ పాతవి టెలికాస్ట్‌ చేశారు. దాంతో నాగబాబు అండ్‌ ‘అదిరింది’ కో స్ట్రయిట్‌గా ‘జబర్దస్త్‌’ తో పోటీకి దిగాలని డిసైడ్‌ అయ్యింది. దీన్ని నాగబాబు కన్ఫర్మ్‌ చేశారు.