రష్మీ పేరును ప్రతి సారీ ఎందుకు వాడుతున్నాడో.. ఆయనకే తెలియాలి

305
jabardasth sudigali sudheer comments on rashmi

సుడిగాలి సుధీర్.. తన కామెడీ టైమింగ్ తో బుల్లితెరపై నవ్వులు పూయిస్తూ ఉంటాడు. ముఖ్యంగా తన మీద ఎన్ని పంచ్ లు వేసినా అమాయకపు ఫేస్ పెడుతూ.. అందరూ నవ్వేలా చేస్తూ ఉంటాడు. ఇక సుడిగాలి సుధీర్ పేరు వచ్చిందంటే యాంకర్ రష్మీ పేరు కూడా ముఖ్యంగా బయటకు వస్తూ ఉంటుంది. వీళ్లకు లింక్ లు పెడుతూ ఒక రేంజిలో వారి గురించి సోషల్ మీడియాలో పోస్టులు, కథనాలు ప్రసారం అయ్యాయి. కొందరైతే ఏకంగా పెళ్లి కూడా అయిపోయిందంటూ రాశారు. కానీ వీరు ప్రొఫెషనల్ గా ఫ్రెండ్స్ కానీ.. పర్సనల్ గా చాలా దూరమే..! ఈ విషయంపై రష్మీ గతంలో గట్టి కౌంటర్ ఇచ్చింది. సుధీర్ కూడా పలుమార్లు క్లారిటీ ఇచ్చి ఈ రూమర్స్ కు చెక్ చెప్పాలని చూశాడు. ఈ లింక్ అప్ రూమర్స్ ను అందరూ మరచిపోయిన సమయంలో సుధీర్ మరోసారి వాటిపై కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు.

సుధీర్ ఇప్పుడు హీరోగా కూడా చేస్తున్నాడు. ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ అనే సినిమాలో హీరోగా నటించాడు సుధీర్. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుధీర్ అలీకి ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇక అలీ ఇంటర్వ్యూ అంటే సరదాగా సాగిపోవడమే కాకుండా.. కొన్ని కాంట్రవర్షియల్ ప్రశ్నలు కూడా ఉంటాయి. కానీ ఇక్కడ ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా ప్రశ్నను అడిగినా దాన్ని రష్మీకి లింక్ చేశాడు సుధీర్. నీ ముందు బాలీవుడ్ భామలు దీపకా పదుకొనె, ప్రియాంకా చోప్రా ఉన్నారనుకుందాం.. ఈ ఇద్దర్లో ఒకర్నే హగ్ చేసుకోవాలని అంటే ఎవర్ని సెలెక్ట్ చేసుకుంటావ్ అని రొమాంటిక్ ప్రశ్న వేశాడు అలీ. సుధీర్ మాట్లాడుతూ ఈ ఇద్దరూ కాదు.. వాళ్ల దగ్గరకు వెళ్లి.. రష్మి ఎక్కడ ఉంది? అని అడుగుతా? అని అనేశాడు. ఇది జస్ట్ ప్రోమోలో చూపించిన ప్రశ్న.. దీని వెనుక ఏమి మాట్లాడి ఉంటారు అన్నది పూర్తీ ఎపిసోడ్ ప్రసారం అయ్యాకనే తెలుస్తుంది. ముఖ్యంగా తనకు లింక్ లు పెడుతూ కామెంట్లు చేస్తున్న వాళ్లకు కౌంటర్ గా ఈ వ్యాఖ్యలు చేసి ఉంటాడని కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో రష్మీ పేరుని తీసుకొని రావడం అంత అవసరమా అని కూడా అడుగుతున్నారు.