సాలార్ నుండి రాజమన్నార్‌గా జగ్గూ భాయ్ ఫస్ట్ లుక్..!

0
593
Jagapathi Babu joins Prabhas in Salaar as Rajamanaar first look poster

Salaar Rajamanaar: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ‘కె.జి.ఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సలార్’ మూవీ నుండీ ‘రాజమనార్’ అనే పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేయబోతున్నట్టు నిన్న చిత్ర చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. రాజ‌మ‌న్నార్ పాత్ర‌లో జ‌గ‌ప‌తిబాబు లుక్‌కి సంబంధించిన పోస్ట‌ర్ విడుద‌ల చేశారు.

ప‌వ‌ర్ ఫుల్ లుక్‌లో జ‌గ్గూభాయ్ క‌నిపిస్తుండ‌గా, ఈ చిత్రం ఆయ‌న‌కు మ‌రింత పేరు తెచ్చిపెట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. ముఖం పై ముడతలు, ముక్కుకి రింగ్, నోటిలో సిగరెట్టు పెట్టుకుని చాలా క్రూరంగా కనిపిస్తున్నాడు జగ్గూబ్బాయ్. గ్యాంగ్ స్టర్ డ్రామాతో తెరకెక్కుతున్న చిత్రమని వార్త‌లు వ‌స్తుండగా, ఇందులో పాకిస్తాన్ ఆర్మీ బంధించిన 54 మంది భారతీయ సైనికుల్ని విడిపించే సాహసి గా దేశభక్తుడైన సైనికుడిగా ప్రభాస్ క‌నిపిస్తార‌ని టాక్స్ వినిపిస్తున్నాయి.

Jagapathi babu first look poster as a Rajamanaar from Prabhas Salaar. director by Prashanth Neel

నా కెరీర్ లోనే ఇది బెస్ట్ వరస్ట్ లుక్’ అంటూ జగపతి బాబు కూడా తన లుక్ పై సెటైర్ వేసుకున్నాడు. అంతేకాదు ఇంత ప్రాముఖ్యమైన పాత్రకు తనని ఎంపిక చేసుకున్నందుకు గాను దర్శకుడు ప్రశాంత్ నీల్ కు, హీరో ప్రభాస్ కు, నిర్మాతలు ‘హోంబెల్స్’ వారికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు.