Homeసినిమా వార్తలుPushpa 2 - SSMB28 కీలకమైన పాత్రలో జగ్గు భాయ్..లుక్కు మామూలుగా ఉండదంట..!

Pushpa 2 – SSMB28 కీలకమైన పాత్రలో జగ్గు భాయ్..లుక్కు మామూలుగా ఉండదంట..!

Jagapathi Babu Key role in Pushpa 2 and SSMB28, Jagapathi Babu upcoming movies, Pushpa 2 The Rule, SSMB28 key role, Jagapathi Babu movies,

Jagapathi Babu Key Role in Pushpa 2- SSMB28: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో జగపతి బాబు (Jagapathi Babu) అంటే ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు. ఫ్యామిలీ మెన్ గా తను తీసే ప్రతి ఒక్క సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యేవి. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒకప్పుడు విలన్ పాత్రల కోసం వేరే రాష్ట్రానికి సంబంధించిన నటీనటుల నుండి తీసుకోవచ్చేవారు. ఆ తర్వాత ప్రకాష్ రాజ్, ఇప్పుడు విలన్ రోల్ చేయాలంటే జగపతి బాబు కే సాధ్యం అనే రేంజ్ కి ప్రస్తుతం సినిమాలో చేస్తున్నారు.

Jagapathi Babu Key Role in Pushpa 2- SSMB28: ప్రస్తుతం రాబోతున్న సినిమాల్లో కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన నటీనటులను విలన్ (Villain) అలాగే హీరోయిన్స్ గా మన తెలుగు ప్రజలకు పరిచయం చేస్తున్నారు దర్శకులు. అలాంటి టైంలో కూడా జగపతి బాబు కి (Jagapathi Babu) వరుస సినిమా ఆఫర్లు వస్తున్నాయి. బాలకృష్ణ సినిమాతో విలన్ గా (Villain) పరిచయమైన జగపతిబాబు తరువాత వెనక్కి చూడకుండా అన్ని పాత్రలను చేసుకుంటూ వస్తున్నారు.

ప్రస్తుతం జగపతి బాబు చేతిలో, అల్లు అర్జున్ (Allu Arjun) అలాగే సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప 2 (Pushpa 2) అంతేకాకుండా మహేష్ బాబు (Mahesh Babu) – త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న SSMB28 సినిమాలో కీలకమైన పాత్రలు చేస్తున్నారు. ఇటీవలే తాను పుష్ప 2 (Pushpa 2 The Rule) సినిమా లో నటిస్తున్నట్లుగా జగపతి బాబు ప్రకటించిన విషయం తెల్సిందే.

Jagapathi Babu Key role in Pushpa 2 and SSMB28

ఈ రెండు సినిమాల్లో జగపతి బాబు (Jagapathi Babu) తన లుక్కు రఫ్ అలాగే రెస్టిక్ గా ఉంటుందని అంతకుముందు చేసిన పాత్రలకు చాలా విభిన్నంగా ఉంటుందని చెప్పుకు రావటం జరిగింది. మహేష్ బాబు (Mahesh Babu) సినిమాలో తన పాత్ర అరవింద సమేత కన్నా క్రూరంగా ఉంటుందని తెలియజేశారు. జగపతిబాబు చేస్తున్న పాత్రలకు ఈ మధ్య ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడం జరుగుతుంది అందుకనే దర్శకులు అలాగే నిర్మాతలు కూడా తనకి అవకాశాలు ఇవ్వటానికి ముందుకు వస్తున్నారు. మరి జగపతి బాబు రాబోయే సినిమాలు Pushpa 2 – SSMB28 లో తన మార్పు ఎలా చూపిస్తారు అనేది వేచి చూడాల్సిందే..

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY