Jagapathi Babu, Bala Krishna, Tollywood Movie News
Jagapathi Babu, Bala Krishna, Tollywood Movie News

బాలయ్య సినిమాల్లో బలమయిన విలన్ పాత్రలు ఉంటాయి.అయితే వాటన్నిటిలోకి బెస్ట్ అనిపించేలా విలన్ పాత్రని డిజైన్ చేసిన సినిమా లెజెండ్. సినిమా ద్వారా ప్రతినాయకుడిగామారిన జగపతి బాబు బరుసబెట్టి సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు.తెలుగులోనే కాదు తమిళ్ అండ్ మలయాళం భాషల్లో కూడా విలన్ గా ఆఫర్స్ అందుకుంటున్నాడు.

జగపతి బాబు విలన్ అంటేనే ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్ లో ఉంటాయి.అలాంటిది జగపతి రెండు పాత్రలతో ఒకే సినిమాలో కనిపిస్తే అక్కడ విలనిజం క్రూరంగా ఉంటుంది,హీరోయిజం చేసుకున్నంత వర్క్ అవుట్ అవుతుంది.అందుకే ఇప్పుడు KS రవికుమార్ డైరెక్షన్ లో బాలయ్య చెయ్యబోతున్న సినిమాలో జగపతి బాబు ని డ్యూయల్ రోల్ విలన్ గా చూపించబోతున్నారు.లెజెండ్ లాంటి క్యారెక్టర్ పడితే జగపతి బాబు చెలరేగిపోతాడుఅనడంలో మాత్రం నో డౌట్.

ఇక అలాంటి ప్రతి నాయకుడిని ఎదుర్కోవడానికి బాలయ్య కూడా జూలు విదిల్చిన సింహంలా చెలరేగాలి. పైగా అచొచ్చిన పోలీస్ గెట్ అప్.ఇక సంక్రాంతి సెంటిమెంట్ ఎటూ ఉంది.ఓవర్ ఆల్ గా చూస్తే ఇన్నాళ్లు సింగిల్ షాట్స్ తో అలరించిన JB ఇప్పడు మాత్రం డబుల్ రోల్ తో దుమ్ము దులపబోతున్నాడు అని అర్ధమవుతుంది.