పండగ సీజన్లో మన తెలుగు పెద్ద హీరోలు బాక్స్ ఆఫీస్ వద్ద కొత్త సినిమాలను విడుదల చేసి పోటీ పడటం సహజమే. అయితే ఈసారి బాక్సాఫీస్ వద్ద చిరంజీవి అలాగే రజినీకాంత్ పోటీ పడుతున్నారు. ఒకరోజు తేడాతో భోళాశంకర్ అలాగే జైలర్ సినిమాలు ఈనెల విడుదలకు సిద్ధమయ్యాయి. భోళాశంకర్ ఆగస్టు 11న విడుదల అవుతుంటే రజినీకాంత్ జైలర్ సినిమా ఆగస్టు 10న విడుదలకు సిద్ధం చేశారు. భోళాశంకర్అ లాగే జైలర్ మూవీ బిజినెస్ కూడా ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంది.
దీనితో మెగాస్టార్ వర్సెస్ సూపర్ స్టార్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు సినీ ప్రేక్షకులు. అయితే చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన తరువాత మళ్ళీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా భోళాశంకర్ సినిమాని తెరకెక్కించడం జరిగింది. అలాగే రజినీకాంత్ తన ముందు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద తగినంత ఫలితాలను ఇవ్వకపోయేసరికి జైలర్ సినిమా మీద ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టుకున్నారు.
ఒకరకంగా చూస్తే జైలర్ సినిమా కూడా ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో వచ్చినట్టు రీసెంట్ గా చూసిన ట్రైలర్లో అర్థమవుతుంది. ఇక ఈ రెండు సినిమాల అడ్వాన్స్ బుకింగ్ విషయానికి వస్తే, ఒక్క హైదరాబాద్ సిటీలోనే జైలర్ సినిమా బుకింగ్ ఓపెన్ చేసిన టైం నుండి ఈరోజు దాకా దాదాపు 50 లక్షల పైనే గ్రాస్ ని కలెక్ట్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. అయితే భోళాశంకర్ మాత్రం 40 లక్షల వరకే గ్రాస్ ని కలెక్ట్ చేసిందంట.

ఈ రెండు సినిమాలు విడుదల అవటానికి ఇంకా నాలుగు రోజుల టైం ఉంది. ఆ లోపు అడ్వాన్స్ బుకింగ్ ఎవరు ముందు ఉంటారు తెలియాల్సి ఉంది అలాగే విడుదలైన తర్వాత బాక్సాఫీస్ వద్ద జైలవ లేదంటే భోళాశంకర్ హిట్టు కొడుతుందా అనేది వేచి చూడాల్సిందే. అయితే ఎంత కాదనుకున్నా టాలీవుడ్ విషయానికొస్తే మొదటగా సినీ ప్రియులు చిరు సినిమాకే ప్రాధాన్యత ఇస్తారు. అసలే రజనీ వరుస ఫ్లాప్ లతో ఫామ్ లో లేరు. కాబట్టి ‘జైలర్’ కంటెంట్ బాగుందని మౌత్ టాక్ వస్తేనే వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి చిరు ‘భోళాశంకర్’కు రజనీ ‘జైలర్’ పోటీయే కాదని అంటున్నారు ఇంకొంతమంది సినీ ప్రియులు.