Jailer Telugu Movie Review: సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం “జైలర్” ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలైంది. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామాలో ఆకట్టుకునే తారాగణం ఉంది. తలైవర్ (రజనీకాంత్) నటించిన సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఇంత విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ భారీ అంచనాలను ఈ సినిమా అందుకుంటుందో లేదో జైలర్ మూవీ రివ్యూని చూద్దాం.
విడుదల తేదీ : | ఆగస్టు 10, 2023 |
జైలర్ రివ్యూ & రేటింగ్ | 2.75/5 |
నటీనటులు: | రజినీకాంత్, రమ్యకృష్ణ, తమన్నా, సునీల్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ |
దర్శకుడు : | నెల్సన్ దిలీప్ కుమార్ |
సంగీతం: | అనిరుద్ రవిచంద్రన్ |
నిర్మాతలు: | కాలనీతి మారన్ |
కథ : ముత్తు అని పిలవబడే ముత్తువేల్ పాండియన్ (రజినీకాంత్) రిటైర్డ్ జైలర్ తన కుటుంబంతో సాధారణ జీవితాన్ని గడుపుతాడు. వర్మ అనే స్మగ్లర్‌తో గొడవపడే అతని కొడుకు అర్జున్ అంకితభావంతో పనిచేసే పోలీసు అధికారి. అర్జున్ రహస్యంగా అదృశ్యమైనప్పుడు, ముత్తు తన కొడుకు హత్యకు గురయ్యాడని తెలుసుకుంటాడు.
తన ఫ్యామిలీని సేవ్ చేసుకోవడానికి ముత్తు వెల్ పాండియన్ ఏం చేశాడు ?, తన కుటుంబాన్ని చంపాలని ప్రయత్నిస్తున్న వారి పై ముత్తు ఎలా ఎటాక్ చేశాడు ?, చివరకు ముత్తు తాను అనుకున్నది సాధించాడా ?, లేదా ?, ఇంతకీ ముత్తు కొడుకు నిజ స్వరూపం ఏమిటి ? అనేది మిగిలిన కథ.
సాంకేతిక విభాగం : నెల్సన్ దిలీప్ సినిమాని తీయటంలో సక్సెస్ అయ్యాడు అదే చెప్పాలి కానీ స్టోరీని హ్యాండిల్ చేయటం అలాగే రాసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. కరెక్ట్ గా చెప్పాలంటే సినిమాలో తగినంత తారాగణం ఉన్నప్పటికీ వాళ్లని చూపించడంలో ప్రయత్నం చేసినప్పటికీ అది కుదరలేదు. సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ అందించిన సంగీతం బాగుంది.
విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ చాలా సూపర్ అని చెప్పాలి కొన్ని కొన్ని సన్నివేశాలు అయితే రజనీకాంత్ ని తన ఫ్యాన్స్ ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా చూపించగలిగారు. ఎడిటింగ్ బాగున్నప్పటికీ, సెకెండాఫ్ లో కొన్ని సాగతీత సీన్స్ ను ట్రీమ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. సినిమాలోని కాలనీతి మారన్ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

తీర్పు : రజనీకాంత్ చాలా రోజుల తర్వాత జైలర్ అనే సినిమాతో మన ముందుకు రావడం జరిగింది. కొన్ని సంవత్సరాలుగా రజనీకాంత్ కి బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత సక్సెస్ అయితే ఏ సినిమా ఇవ్వలేదు. ఆత్రుతగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి జైలర్ సినిమా ఒక ఫుల్ మీల్స్ అనే చెప్పాలి. దానికి తోడు అనిరుద్ సంగీతం కూడా జోడించడంతో ఫ్యాన్స్ సంబరాలు కి అంతులేకుండా పోయింది. జైలర్ గా సూపర్ స్టార్ రజినీకాంత్ తన అభిమానులను మాత్రం ఉర్రూతలూగించారు. పవర్ ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్స్ తోనూ సూపర్ స్టార్ మెప్పించారు.
ముఖ్యంగా చెప్పాలంటే రజనీకాంత్ జైలర్ పాత్రలో నటించిన విధానం ఆకట్టుకుంది. కొన్ని యాక్షన్ అండ్ ప్లాష్ బ్యాక్ సీక్వెన్స్ స్ లో మరియు తన స్టైలిష్ లుక్స్ తో రజినీకాంత్ చాలా బాగా నటించాడు. మరో కీలక పాత్రలో నటించిన సునీల్ కూడా చాలా బాగా నటించాడు. తల్లి పాత్రలో రమ్యకృష్ణ ఒదిగిపోయింది.దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ రాసుకున్న యాక్షన్ సీన్స్ కొన్ని బాగున్నాయి. సినిమా ఫస్ట్ అఫ్ అంత కామెడీ అలాగే కొన్ని యాక్షన్ సన్నివేశాలతో స్ట్రైట్ గా తీసుకెళ్లిన దర్శకుడు సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి స్టోరీని కొంచెం లాగ్ చేసినట్టు అనిపించింది.
ఈ జైలర్ లో చాలా సన్నివేశాలు బాగా స్లోగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. గత తన సినిమాల శైలిలోనే నెల్సన్ ఈ సినిమాని కూడా నడిపారు. పైగా కొన్ని సన్నివేశాలు మినహా ఎక్కడా ఫ్రెష్ నెస్ కనిపించదు. ఒక్క క్లైమాక్స్ లో తప్ప మిగిలిన కథనంలో ఉత్సుకతను పెంచటంలో నెల్సన్ విఫలమయ్యారు. ఓవరాల్ గా ఈ జైలర్ సినిమా భారీ తారాగణంతో అలాగే యాక్షన్ సీన్స్ బాగున్నాయి. కానీ సినిమాలో బలమైన ఎమోషన్, కాన్ ఫ్లిక్ట్ ఉన్నప్పటికీ అవి ఆకట్టుకోలేకపోయాయి. ఈ వీకెండ్ లో సరదాగా ఒకసారి వెళ్లి చూసి రావచ్చు అలాగే ఇది పక్కా ఫాన్స్ మాస్ సినిమా అనుకోని చెప్పవచ్చు.