తొలి 007 కానరీ కన్నుమూత..!

0
310
james bond iconic sean connery dies at 90

Sean Connery: స్కాటిష్‌ నటుడు సీన్ కానరీ ‌ఇటీవలే 90వ పుట్టినరోజు జరుపుకున్న ఆయన కన్నుమూయడం హాలీవుడ్‌ పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. వయసు పైబడటంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిద్రలోనే కన్నుముసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

జేమ్స్ బాండ్‌ సిరీస్‌కు చెందిన ఏడు సినిమాల్లో సీన్ కానరీ నటించారు. మొదటిసారిగా 1962లో వచ్చిన బాండ్ సిరీస్ ‘డా. నో’లో జేమ్స్ బాండ్‌గా నటించి మెప్పించిన ఆయన.. ఆ తర్వాత 1963లో వచ్చిన ‘ఫ్రమ్ రష్యా విత్ లవ్’, 1964లో వచ్చిన ‘గోల్డ్ ఫింగర్’, 1965లో వచ్చిన ‘థండర్‌బాల్’, 1967లో వచ్చిన ‘యూ ఓన్లీ లివ్ ట్వైస్’, 1971లో వచ్చిన ‘డైమండ్స్ ఆర్ ఫరెవర్’, 1983లో వచ్చిన ‘నెవర్ సే నెవర్ ఎగైన్’ వంటి వరుస జేమ్స్ బాండ్ సిరీస్‌లలో నటించి వెండితెరపై ఓ వెలుగు వెలిగారు.

‘ది అన్‌ టచ్‌బుల్స్‌’ సినిమాలో అద్భుతంగా నటించి ఉత్తమ సహాయ నటుడిగా ఆస్కార్‌ అవార్డు సైతం అందుకున్నారు. అలాగే రెండుసార్లు గోల్డెన్ గ్లోబ్స్ అవార్డులతో పాటు రెండుసార్లు బాఫ్టా అవార్డులను కూడా ఆయన గెలుచుకున్నారు. సీన్ కానరీ మృతి పట్ల ప్రపంచ ఆడియన్స్ అంతా విచారం వ్యక్తం చేస్తున్నారు.

Previous articleAlia Bhatt to sing a song for her SS Rajamouli RRR?
Next articleSean Connery, Screen Legend Who Made James Bond Iconic, Dies At 90