nasena youth protest on Ram Gopal Varma New Movie.. amma rajyam lo kadapa biddalu
nasena youth protest on Ram Gopal Varma New Movie.. amma rajyam lo kadapa biddalu

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ ప్రతీ సారి సంచలనాత్మక సినిమాలు చేస్తూ ఉంటాడు. ఆయన చేసే సినిమాల్లో కంటెంట్ కంటే కాంట్రవర్సీనే ఎక్కువ ఉంటుంది. ఆ కాంట్రవర్సీ స్థాయిని కూడా ఈ మధ్య మరింత పెంచాడు. ఈ మధ్య ఆయన తీసిన “అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు” సినిమా ఎంత వివాదాస్పదం అయిందో అందరికీ తెలుసు. ఆ సినిమా టైటిల్ మొదలుకుని రిలీజ్ వరకు ప్రతీ చోట వివాదామే.

అయితే ఈ సినిమాలో వర్మ చంద్రబాబు, లోకేష్ తో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని దారుణంగా టార్గెట్ చేశాడు. సినిమాలో ఏమాత్రం సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ వచ్చి స్టేట్మెంట్లు ఇచ్చి వెళ్లిపోతుంటారు. అలాగే పవన్ కళ్యాణ్ టీడీపీతో కుమ్మక్కైన సన్నివేశాన్ని కూడా సినిమాలో చూపించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని కించపరిచే విధంగా సన్నివేశాలున్నాయని, అవి తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నయని అంటున్నారు. ఆ సన్నివేశాలు జనసేన పార్టీల వారిని తీవ్ర ఆగ్రహానికి గురి చేశాయి. దీనితో జనసేన పార్టీ వారు రామ్ గోపాల్ వర్మ మీద వినూత్న రీతిలో నిరసనని ప్రదర్శించారు. వర్మ చనిపోయినట్లుగా శ్రద్ధాంజలి బ్యానర్ ఏర్పాటు చేయడంతో పాటు ఒకింత పరుష పదాలతో ఆయను తిట్టడం జరిగింది.

ఆ సంఘటనపై వర్మ స్పందిస్తూ, బాబు, లోకేష్, పవన్ వీరాభిమానులు సినిమా గురించి బ్యాడ్ పబ్లిసిటీ చేయడం ఆపి, ఆ మూవీని అర్థం చేసుకోవాలన్నారు. తాను దెయ్యమై వస్తానని మీ నాయకుడి అంతు చూస్తాం అని చెప్పుకొచ్చాడు. సదరు అభిమానులపై ప్రమాణం చేస్తూ ఎవరిని కించపరచడానికి నేను ఆ సినిమా చేయలేదని, కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం తీశానని చెప్పుకొచ్చారు.