Bollywood Actress Jhanvi Kapoor's Shocking statement on Vijay Devarakonda
Bollywood Actress Jhanvi Kapoor's Shocking statement on Vijay Devarakonda

(Bollywood Actress Jhanvi Kapoor’s Shocking statement on Vijay Devarakonda) సినీ పరిశ్రమలో బాలీవుడ్ ని మినహాయిస్తే రీజనల్ లాంగ్వేజస్ లో టాలీవుడ్ హీరోల అందంతో మరొకరిని పోల్చలేం. గ్లామర్ అనే పాయింట్ చుట్టూనే తెలుగు సినిమాలు తిరుగుతూంటాయనే సంగతి తెలిసిందే. అటువంటి అందంతో ఈ మధ్య దూసుకొచ్చిన మరో హీరో విజయ్ దేవరకొండ అనే చెప్పాలి. యూత్ ని అట్రాక్ట్ చేయడంలో రీసెంట్ టైమ్స్ విజయ్ ను కొట్టిన వారు లేరు. ఈ అందమే ఇప్పుడు ఓ బాలీవుడ్ అప్ కమింగ్ సెన్సేషన్ హీరోయిన్ ను ఆకట్టుకుంది.

బాలీవుడ్ క్రేజీ గాళ్ జాన్వీ కపూర్ మన రౌడీ స్టార్ పై మనసు పారేసుకుందట. తను ఏ షోకు వెళ్లినా ఎవరి గురించి మాట్లాడినా.. చివరికి రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి మాత్రం మాట్లాడకుండా ఉండ లేకపోతోంది. ఇటీవల నటి నేహా దూపియా నిర్వహిస్తున్న `నో ఫిల్టర్ నేహా`అనే కార్య్రమం లో జాన్వీకపూర్ పాల్గొంది. తన మనసులో దాచుకున్న భావాల్ని ఎలాంటి ఫిల్టర్ లేకుండా బయట పెట్టేసింది. పనిలో పనిగా తన రూమర్డ్ బోయ్ ఫ్రెండ్ ఇషాన్ కత్తర్ గురించి కూడా కొన్ని రహస్యాల్ని బయట పెట్టేయడం ఆసక్తిని కలిగిస్తోంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుతూ.. అతని పై చాలా రోజులుగా క్రష్ వుందని.. ఇప్పటికే చాలా ఫీలర్స్ వదిలాను కానీ.. ఇంత వరకు అతడి నుంచి ఏలాంటి అప్ డేట్ రాలేదని కొంటెగా సమాధానం చెప్పింది. అంటే విజయ్ నుంచి తనకు ఇంకా ఎలాంటి ఆఫర్ రాలేదని ఓపెన్ గానే చెప్పేసిందన్న మాట.

విజయ్ దేవరకొండ క్రేజ్ సౌత్ ఇండియాలోనే కాకుండా బాలీవుడ్ కి కూడా పాకింది. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ లో నటించనప్పటికీ ఆ సినిమా ఒరిజనల్ వెర్షన్ హీరోగా మంచి క్రేజ్ వచ్చింది. జాన్వీ తాజా రెస్పాన్స్ ని బట్టి చూస్తుంటే విజయ్ దేవర కొండ `ఫైటర్` కోసం జాన్వీ ఎదురు చూస్తోందనే అర్థం. ఈ ఇద్దరు కలిస్తే సిల్వర్ స్క్రీన్ మెంటలెక్కి పోవడం ఖాయమని బాలీవుడ్- టాలీవుడ్ సర్కిల్స్ లో రౌడీ ఫ్యాన్స్ భావిస్తున్నారు మరి. దీనిపై అఫిషియల్ కన్మఫర్మేషన్ వస్తే విజయ్ అభిమానులకు ఆనందానికి అవధులు ఉండవు.