టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో తెలుగులో అరంగేట్రం చేసిన నవీన్ తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి నటిస్తున్న తాజా చిత్రం జాతి రత్నాలు. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లాహ్ హీరోయిన్గా నటిస్తున్నారు.
ఈ సినిమాలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను అనుదీప్ దర్శకత్వంలో నాగ్ అశ్విన్ నిర్మిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్, పాటలు అన్నీ కూడా సినిమాపై అంచనాలను అధికం చేశాయి.
ఈ సినిమా ట్రైలర్ను ప్రభాస్ విడుదల చేసారు . అయితే ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా ఈ నెల11న విడుదల కానుంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.