‘జాతిరత్నాలు’ ట్రైలర్ చుసిన ప్రభాస్‌

366
jathi-ratnalu-trailer-Launch-by-prabhas
jathi-ratnalu-trailer-Launch-by-prabhas

‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్‌ నవీన్‌ పోలిశెట్టి హీరోగా అనుదీప్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాతిరత్నాలు’. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. స్వప్న సినిమాస్‌ పతాకంపై నాగ్‌ అశ్విన్‌ నిర్మించిన ఈ చిత్రం మార్చి 11న విడుదలవుతోంది. ప్రస్తుతం ఈ చిత్రబృందం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.

 

 

తాజాగా ‘జాతిరత్నాలు’ ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించారు. మార్చి 4 సాయంత్రం 4:20 నిమిషాలకు ఈ ట్రైలర్‌ విడుదల చేయబోతోన్నట్లుగా చిత్రయూనిట్‌ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ ట్రైలర్ ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విడుదల చేయనున్నారు.

 

 

ట్రైలర్ లాంచ్ లో భాగంగా జాతిరత్నాలు టీమ్ ప్రభాస్ ని కలవటానికి బొంబాయి వెళ్ళింది . తాజాగా ఆ వీడియో ని రిలీజ్ చేసారు టీం – జోగిపేట TO బొంబాయి అని కాప్షన్ పెట్టారు.  ఇప్పటికే టైటిల్, పోస్టర్స్, టీజర్ లతో ఆకట్టుకున్న జాతిరత్నాలు.. ప్రభాస్ విడుదల చేసిన ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి మరి .