‘జాతిరత్నాలు’ ట్రైలర్ విడుదల చేయనున్న ప్రభాస్‌

341
jathi-ratnalu-trailer-to-be-release-by-prabhas-on-march4th
jathi-ratnalu-trailer-to-be-release-by-prabhas-on-march4th

‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్‌ నవీన్‌ పోలిశెట్టి హీరోగా అనుదీప్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జాతిరత్నాలు’. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. స్వప్న సినిమాస్‌ పతాకంపై నాగ్‌ అశ్విన్‌ నిర్మించిన ఈ చిత్రం మార్చి 11న విడుదలవుతోంది. ప్రస్తుతం ఈ చిత్రబృందం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.

 

 

తాజాగా ‘జాతిరత్నాలు’ ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించారు. మార్చి 4 సాయంత్రం 4:20 నిమిషాలకు ఈ ట్రైలర్‌ విడుదల చేయబోతోన్నట్లుగా చిత్రయూనిట్‌ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ ట్రైలర్ ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విడుదల చేయనున్నారు. ఇప్పటికే టైటిల్, పోస్టర్స్, టీజర్ లతో ఆకట్టుకున్న జాతిరత్నాలు.. ప్రభాస్ విడుదల చేయబోయే ట్రైలర్ తో మరోసారి నవ్వించడానికి రాబోతున్నారు.