బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘జవాన్’. సెప్టెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ అవుతోంది. భారీ ఎక్స్ పెక్టేషన్స్ ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమైన ఈ మూవీ ట్రైలర్ రీసెంట్ గానే రిలీజైంది. దీంతో సినిమాపై ఉన్న అంచనాలు ఆకాశాన్నంటాయి.
ఈ నేపథ్యంలో మేకర్స్ ‘జవాన్’ అడ్వాన్స్ బుకింగ్స్ ను ఓపెన్ చేశారు. సినిమా కోసం ఎంత ఆతృతగా ఫ్యాన్స్, ఆడియెన్స్ ఎదురు చూస్తున్నారో అడ్వాన్స్ బుకింగ్స్ వస్తున్న రెస్పాన్స్ చూస్తేనే అర్థమవుతుంది.అడ్వాన్స్ బుకింగ్స్ వివిషయంలో ‘జవాన్’ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంటుంది. ఇలాంటి రికార్డ్స్ క్రియేట్ చేయటం ఓ హిస్టరీ అని ఎగ్జిబిటర్స్ మాట్లాడుకోవటం విశేషం.
ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్సు బుకింగ్ వివరాల్లోకి వెళితే, భారతదేశంలో, జవాన్ బుకింగ్ మొదటి రోజు పెద్ద బజ్ క్రియేట్ చేసింది. PVR, INOX మరియు Cinepolisలో భారీ టిక్కెట్ల విక్రయాలు జరిగాయి. PVRలో 90K టిక్కెట్లు, INOXలో 60,000 టిక్కెట్లు మరియు Cini పోలీసులో 30,000 టిక్కెట్లు అమ్ముడయ్యాయి. మల్టీప్లెక్స్ నెట్‌వర్క్‌లో 1.75 మిలియన్ టిక్కెట్లు అమ్ముడయ్యాయి, దేశవ్యాప్తంగా 3 మిలియన్లకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయి.
అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేసిన కొన్ని గంటల్లోనే టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. నేషనల్ వైడ్ ఉన్న ఎగ్జిబిటర్స్ లో ఇదే హాట్ టాపిక్ అయ్యింది. ‘జవాన్’ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై అట్లీ దర్శకత్వంలో గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు. గౌరవ్ వర్మ ఈ సినిమాకు సహ నిర్మాత. సెప్టెంబర్ 7న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవుతుంది.