Homeసినిమా వార్తలుషారూఖ్ ఖాన్ ఆల్ టైమ్ టాప్ గ్రాసర్స్ సాధించిన హీరోగా రికార్డ్.

షారూఖ్ ఖాన్ ఆల్ టైమ్ టాప్ గ్రాసర్స్ సాధించిన హీరోగా రికార్డ్.

The TOP TWO HIGHEST GROSSERS OF ALL TIME NOW BELONG TO SHAH RUKH KHAN, Jawan and Pathaan total box office collection, Jawan and Pathaan worldwide total gross collection

The TOP TWO HIGHEST GROSSERS OF ALL TIME NOW BELONG TO SHAH RUKH KHAN, Jawan and Pathaan total box office collection, Jawan and Pathaan worldwide total gross collection

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఎవరికీ సాధ్యం కానీ రికార్డును సుసాధ్యం చేసుకున్న ఏకైక హీరో కింగ్ ఖాన్ షారూఖ్. ఈ అరుదైన రికార్డును ఆయన ఒకే ఏడాదిలోనే సాధించటం విశేషం.

‘జవాన్’ సినిమాతో వరుసగా రెండో సారి టాప్ గ్రాసర్ సాధించిన హీరోగా ఆయన నిలిచారు. అంతే కాకుండా రూ.600 కోట్ల కలెక్షన్స్ సాధించిన తొలి సినిమా ఇది ఓ రికార్డ్ క్రియేట్ చేసింది. సెప్టెంబర్ 7న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ సూపర్బ్ కలెక్షన్స్‌ను సాధిస్తూ దూసుకెళ్తోంది. శుక్రవారం జవాన్ సినిమా హిందీ చలన చిత్ర చరిత్రలో టాప్ గ్రాసర్ మూవీగా హిస్టరీని క్రియేట్ చేసి ఓ బెంచ్ మార్క్‌ను సెట్ చేసింది.

రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై రూపొందిన జవాన్ సినిమా విడుదలైన రోజు నుంచి బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ వసూళ్లను సాధిస్తూ హిస్టరీ అనే పదానికి పర్యాయపదంగా నిలుస్తోంది. సరికొత్త రికార్డులను వసూళ్ల పరంగా ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

హిందీ సిినిమాల పరంగా రూ.525.50 కోట్లు, ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రూ.584.32 కోట్లను సాధించిన జవాన్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.1043.21 కోట్లకు వసూళ్లను రాబట్టి అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. ఈ భారీ కలెక్షన్స్‌ను ఈ చిత్రం కేవలం 22 రోజుల్లోనే సాధించటం విశేషం.

ప్రతీ వారం కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికీ వాటి ప్రభావం జవాన్ సినిమాపై పడలేదు. మూడు వారాలవుతున్నప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఆదరణతో పాటు ప్రశంసలను అందుకుంటోందీ చిత్రం.