ఈ ఏడాది జనవరి పఠాన్‌తో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ రికార్డ్స్ క్రియేట్ చేశారు బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్. ఇప్పుడు మరోసారి ‘జవాన్’గా ఆడియెన్స్‌ను అలరించటానికి సిద్ధమయ్యారు. మాస్ అండ్ కమర్షియల్ సినిమాలను తెరకెక్కించటంలో తనదైన ప్రత్యేకతను చాటుకున్న దర్శకుడు అట్లీ డైరెక్షన్‌లో జవాన్ సినిమా రూపొందుతోంది. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
ఈరోజు మేకర్స్ జవాన్ విడుదల తేదీని ప్రకటించడం జరిగింది. సెప్టెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ‘జవాన్’ సినిమాను విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. దానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. అందులో ఓ మాస్క్ ధరించిన హీరో పదునైన ఈటెను పట్టుకుని ఎగురుతున్నాడు. పోస్టర్‌ను గమనిస్తుంటే మరోసారి షారూఖ్ మాస్ అండ్ ఇన్‌టెన్స్ క్యారెక్టర్‌తో ఆకట్టుకోనున్నారని స్పష్టమవుతుంది.
షారూఖ్ ఖాన్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ చిత్రంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్, టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియో సినిమాపై అంచనాలు పెరిగాయి. మ్యూజిక్ సెన్సేషనల్ అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రానికి జి.కె.విష్ణు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
#Jawan #7thSeptember2023 worldwide pic.twitter.com/jb8hwmVnIP
— atlee (@Atlee_dir) May 6, 2023
Web Title: Shah Rukh Khan and Nayanthara starring Jawan all set to hit theaters on September 7th worldwide..