‘రాధేశ్యామ్’ లో కీలకపాత్రలో మలయాళ స్టార్!

0
292
Jayaram praised the Baahubali star and revealed that he is part of his upcoming film, Radhe Shyam

డార్లింగ్ ప్రభాస్ ఏం చేసినా ఎంతో స్పెషల్ గానే ఉంటుంది. ముఖ్యంగా ప్రభాస్ ఆతిథ్యం గౌరవ మర్యాదల గురించి సాటి తారలు ప్రత్యేకంగా చెప్పుకుంటారు. కాజల్.. అనుష్క.. శ్రద్ధా కపూర్..నదియా.. రవీనా టాండన్ సహా పలువురు తారలు ప్రభాస్ మంచి వ్యక్తిత్వాన్ని ఆకాశానికెత్తేశారు. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. జిల్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే కధానాయిక కాగా .. గోపి కృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈమధ్యనే ఇటలీలో భారీ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది చిత్ర బృందం. ప్రస్తుతం హైదరాబాద్ షెడ్యూల్ కోసం దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు. దీనికోసం 30కోట్ల భారీ వ్యయంతో ఒక సెట్ ను కూడా నిర్మిస్తున్నారని సమాచారం. ఇప్పుడు ప్రభాస్ రాధే శ్యామ్ లో నటిస్తున్న సీనియర్ నటుడు జయరామ్ కూడా అదే పంథాలో డార్లింగ్ మంచి మనసును నిబద్ధతను పొగిడేశాడు. ఆ విషయాన్ని ట్విట్టర్ లో అఫీషియల్ ప్రకటించారు. అలాగే బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ ప్రభాస్ తల్లిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు జయరామ్ కూడా ‘రాధేశ్యామ్’ టీంతో జాయిన్ అవుతుండడంతో సినిమాకు మరింత బలం చేకూరింది.

రాధేశ్యామ్ గొప్ప ప్రేమకథా చిత్రమని.. హృదయాన్ని తాకుతుందని జయరామ్ అన్నారు. ఆ అరుదైన ప్రేమకథను వీలైనంత త్వరగా పెద్ద తెరపై చూడటానికి ఆసక్తిగా ఉన్నామని తెలిపారు. జయరామ్,.. అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ సినిమాలోనూ, అంతకు ముందు భాగమతిలోనూ కీలక పాత్రల్లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. అందుకే ఆయన ప్రెజెన్స్ రాధేశ్యామ్ మూవీకి కూడా ప్లస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ఇప్పుడు జయరామ్, ప్రభాస్ సెల్ఫీ సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో.. అభిమానులు ఖుషీ అవుతున్నారు.

Previous articleఖరీదైన విల్లా కొనుకున్న సుకుమార్.. ఎంతో తెలుసా ?
Next articleActor Jayaram joins the cast of Prabhas’ ‘Radhe Shyam’