Jigarthanda Double X Release Date: రాఘవ లారెన్స్, ఎస్.జె.సూర్య ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న హై యాక్షన్ డ్రామా ‘జిగర్ తండా డబుల్ ఎక్స్’ దీపావళికి రిలీజ్ అవుతుంది. దీపావళికి రాబోతున్న భారీ చిత్రాల్లో డేట్ ఫిక్స్ అయిన మూవీ ఇది. ఈ చిత్రాన్ని మేకర్స్ తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.
Jigarthanda Double X Release Date: వెర్సటైల్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో స్టోన్ బెంచ్ ఫిలింస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని కార్తీకేయన్ నిర్మిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్‌లోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి శరవేగంగా చిత్రీకరణను పూర్తి చేసుకుంటోంది. 2014లో విడుదలై బ్లాక్ బస్టర్ అయిన జిగర్ తండా చిత్రానికి ఇది ప్రీక్వెల్. మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చిన రోజు నుంచి ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ మాట్లాడుతూ ‘‘‘జిగర్ తండా డబుల్ ఎక్స్’ చిత్రాన్ని ఈ ఏడాది దీపావళి సందర్భంగా విడుదల చేయనుండటం చాలా హ్యాపీగా ఉంది. ఇంతకు ముందు నా దర్శకత్వంలో రూపొందిన జిగర్ తండాకు ఇది ప్రీక్వెల్‌గా రానుంది. ఆ సినిమా సాధించినట్లే ‘జిగర్ తండా డబుల్ ఎక్స్’ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని భావిస్తున్నాను’’ అన్నారు.

స్టోన్ బెంచ్ ఫిలింస్ అధినేత కార్తికేయన్ సంతానం మాట్లాడుతూ ‘‘‘జిగర్ తండా డబుల్ ఎక్స్’ సినిమాను అనౌన్స్ చేసిన రోజు నుంచి అందరిలో తెలియని ఎగ్జయిట్‌మెంట్ క్రియేట్ అయ్యింది. జిగర్ తండాను ప్రేక్షకులు ఎంతలా ఆదరించారో అలాగే ‘జిగర్ తండా డబుల్ ఎక్స్’ ను కూడా ఆదరిస్తారనే నమ్మకం ఉంది. దీపావళి సందర్భంగా ఈ మాస్ ఎంటర్‌టైనర్‌ను భారీ ఎత్తున తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నాం’’ అన్నారు.
‘జిగర్ తండా డబుల్ ఎక్స్’ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్ రచన, దర్శకత్వ బాధ్యతలను నిర్వహించారు. స్టోన్ బెంచ్ ఫిలింస్ బ్యానర్‌పై కార్తికేయన్ సంతానం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాఘవ లారెన్స్, ఎస్.జె.సూర్య ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు, హిందీ భాషల్లో దీపావళి 2023న రిలీజ్ చేయబోతున్నారు.
Web Title: Raghava Lawrence and S J Suryah next movie Jigarthanda Double X Release Date Confirmed, Jigarthanda Double X Release date, Jigarthanda Double X trailer, Jigarthanda Double X cast crew