Jogi Naidu shocking comments on Pawan Kalyan: ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అటు రాజకీయాల్లోనూ అలాగే సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ ని సినిమా పరంగా విమర్శించకపోయినా రాజకీయపరంగా అయితే మాత్రం విమర్శించే వాళ్ళు చాలానే ఉన్నారు. ఒకోనక్క సందర్భంలో అయితే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ని నేను అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు అని కూడా కామెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు అదే విధంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా జోగినాయుడు పవన్ కళ్యాణ్ పై చేసిన షాకింగ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Jogi Naidu shocking comments on Pawan Kalyan: జోగినాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని సినిమాల్లో కాకపోయినా కొన్ని సినిమాల్లో కనిపిస్తూ ఉంటారు అలాగే కొన్ని గుర్తుండిపోయే క్యారెక్టర్లు కూడా చేశారు. రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో జోగినాయుడు పవన్ కళ్యాణ్ ని విమర్శించారు. నేను ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడా ఆ పార్టీకి పనిచేశానని.. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పెట్టిన పార్టీ సిద్ధాంతాలు బాగున్నప్పటికీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం వాటిని ఆచరించకుండా సినిమా జీవితం ఇంకా గడుపుతున్నారని అన్నారు.
దీనితోపాటు.. నిజానికి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమాలే చేస్తున్నారు రాజకీయాలు చేయడం లేదు.. సినిమాలు చేస్తూ అప్పుడప్పుడు సినిమా ఈవెంట్ లాగా నాకు ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు అలా కనిపించి మళ్లీ సినిమాలు చేసుకుంటున్నారు.. అలాగే పవన్ కళ్యాణ్ కి రాజకీయాలంటే పెద్దగా అవగాహన లేదు అనేది స్పష్టం అవుతుంది.. ఇక జగన్ (CM Jagan) గారి విషయానికి వస్తే తను రాజకీయాల్లో ప్రొఫెషనల్ అని.. ప్రజల మధ్య ఉంటూ రాజకీయాలు చేస్తున్నారని.. అలాగే ప్రజల కోసమే పోరాడుతున్నారని.. చెప్పటం జరిగింది.
అజయ్ ఇంటర్వ్యూలో జోగినాయుడు (Jogi Naidu) ఇంకా మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన రాజకీయ భవిష్యత్తుని చేతులారా నాశనం చేసుకున్నారని.. సినిమాలు చేయకుండా ప్రజల మధ్య ఉంటూ ప్రజలతో గడుపుతూ రాజకీయాలు చేసినట్లయితే తనకి ఒక గుర్తింపు ఉండేదని.. అందుకే ప్రజలు కూడా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ని (Pawan Kalyan) హీరోలాగే చూస్తున్నారు గాని రాజకీయ నేతల చూడటం లేదని.. అందుకే పవన్ కళ్యాణ్ మీద ప్రజలకు ఇంతవరకు నమ్మకం లేక పట్టం కట్టడం లేదని.. నెలకు ఒకసారి కంపటి ప్రసంగించి పోతే ప్రయోజనం ఏమీ ఉంటుంది అంటూ షాకింగ్ కామెంట్ చేయడం జరిగింది.
అలాగే రాజకీయాలంటే ఓపిక ఉండాలని.. ప్రజలతో మమేకం కావాలని.. కానీ పవన్ కళ్యాణ్ ను ఆ లక్షణం లేకపోవడం తన రాజకీయ భవిష్యత్తు ఇలా ఉందని కాటు విమర్శలు చేయడం జరిగింది. జోగి నాయుడు చేసిన విమర్శలపైన జనసేన పార్టీ కార్యకర్తలు అలాగే అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ రెడ్డి పోసాని కృష్ణ మురళి అలాగే ఇప్పుడు జోగి నాయుడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేయడం జరుగుతుంది.
Web Title: Jogi Naidu shocking comments on Pawan Kalyan Political career.. Jogi Nayudu Shocking Comments About Janasena party chief Pawan Kalyan, Jogi Nayudu , Pawan Kalyan , YCP, Janasena Party, Praja Rajyam