Jr NTR and family return to Hyderabad after a vacation in Dubai

కోవిడ్ మహమ్మారీ నుంచి కాస్త రిలీఫ్ దొరకగానే ఇలా విమానయానాలకు రెడీ అయ్యారు టాలీవుడ్ స్టార్ హీరోలు. ఇంతలోనే తారక్ కూడా కుటుంబ సమేతంగా దుబాయ్ ట్రిప్ కి బయల్దేరాడు. తాజాగా హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ప్రత్యక్షమయ్యాడిలా. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం RRR షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి హైదరాబాద్‌లో ఆయన షూటింగ్‌లో పాల్గొంటున్నారు. లాక్‌డౌన్ తరవాత ప్రారంభమైన RRR షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.

సినిమాకు చాలా కీలకమైన సన్నివేశాలను రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్నారు. ఈ చలికాలంలో రాత్రి వేళల్లోనూ షూటింగ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇటీవలే ఒక వీడియోను కూడా విడుదల చేసింది నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్. అయితే, ఈ వీడియో వదిలిన రెండు రోజులకు జూనియర్ ఎన్టీఆర్‌కు సంబంధించి ఒక వార్త బయటికి వచ్చింది. షూటింగ్ నుంచి ఎన్టీఆర్ ఒక చిన్న విరామం తీసుకోబోతున్నారని అన్నారు. అది నిజమే. భార్య లక్ష్మీ ప్రణతి, పెద్ద కుమారుడు అభయ్ రామ్‌తో కలిసి ఎన్టీఆర్ దుబాయ్ వెళ్లారు.

ఆయన తన ఫ్యామిలీతో కలిసి బుధవారం హైదరాబాద్‌లో దిగారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో ఉన్నప్పటి ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి. ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి, అభయ్ రామ్ ఎయిర్‌పోర్టులో కెమెరా కంటికి చిక్కారు. ఈ ఫొటోల్లో ఎన్టీఆర్ కాజువల్ లుక్‌లో చాలా సింపుల్‌గా ఉన్నారు. షూటింగ్ నుంచి కాస్త విరామం తీసుకున్న ఎన్టీఆర్ తిరిగి చరణ్ తో పాటు షూట్ లో తారక్ కూడా జాయిన్ అవుతాడట.