RRR సినిమా తర్వాత రామ్ చరణ్ (Ram Charan) అలాగే జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ప్రస్థానం గ్లోబల్ లెవెల్ లో ఇమేజ్ ని సంపాదించుకున్నారు. అలాగే రాబోయే సినిమాలను కూడా ఇద్దరూ పాన్ ఇండియా లెవెల్ లోని తర్కెక్కిస్తున్నారు. RRR ఆస్కార్ మూవీ ప్రస్థానం తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియా అత్యంత ప్రభావవంతం చేసే ఈరోజు ఎవరు అనే విషయాన్ని తన సర్వే ద్వారా విడుదల చేయడం జరిగింది.
టైమ్స్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ఈ సర్వేలో టాప్ టెన్ హీరోస్ లిస్టు ని గమనిస్తే జూనియర్ ఎన్టీఆర్ (NTR) మొదటి స్థానంలో ఉండగా రామ్ చరణ్ (Ram Charan) రెండో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత స్థానాల్లో ప్రభాస్ (Prabhas), అల్లు అర్జున్ (Allu Arjun) అలాగే మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ఉండటం విశేషం. మొత్తం మీద టాలీవుడ్ హీరోల టాప్ టెన్ లిస్టులో అత్యధికంగా సోషల్ మీడియాలో ప్రభావితం చేసిన హీరోల్లో ఎన్టీఆర్ (NTR) ఉండటం తన ఫ్యాన్స్ అందరూ ఆనందంగా ఉన్నారు.
ప్రస్తుతం రామ్ చరణ్ (Ram Charan) గ్లోబల్ ట్యాగ్ కూడా గత వారం రోజులుగా సోషల్ మీడియా వేదికలో ట్రెండింగ్ లో ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది అలాగే ఇద్దరు ఫాన్స్ మధ్య కూడా చాలా రోజుల నుంచి వివాదాస్పద వ్యాఖ్యలు కామెంట్లు రూపంలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
RRR ఆస్కార్ అవార్డులు పురస్కారం ముగించుకున్న ఇప్పుడు ఇద్దరు హీరోలు తమ రాబోయే సినిమాల్లో బిజీ కావడానికి రెడీ అవుతున్నారు. రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న RC15 సినిమాని పూర్తిచేసే పనిలో ఉండగా. ఎన్టీఆర్ రాబోయే కొత్త సినిమా అయినా NTR30 షూటింగ్ మొదలుపెట్టడానికి సిద్ధమవుతున్నారు.
అమెరికా నుండి తిరిగి వచ్చిన వెంటనే ఈనెల 18వ తారీఖున పూజా కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఆ తర్వాత వెంటనే NTR30 షూటింగు మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఎన్టీఆర్ అలాగే ఫ్యాన్స్ చాలానే నమ్మకాలు పెట్టుకున్నారు. మరికొన్ని రోజులు పోతే గాని NTR30 సంబంధించిన స్టోరీ అలాగే అప్డేట్స్ తెలుస్తాయి.