RRR మేకింగ్ వీడియో: అంచనాలకు మించి

0
389
Jr NTR and Ram Charan's RRR making video out

Roar Of RRR: బాహుబలి తర్వాత తీస్తున్న ‘RRR’ మూవీ అంచనాలకు మించి రూపొందుతున్నట్టు ఉంది. ఈ సినిమా నుంచి వచ్చే ప్రతీ అప్డేట్ కూడా సినిమాపై అంచనాలు రెట్టింపు చేస్తూ వస్తోంది. హీరోహీరోయిన్లు ఫస్ట్ లుక్స్ – తారక్ (NTR) మరియు చరణ్ (Ram Charan) ల ఇంట్రో వీడియోలు – అజయ్ దేవగన్ స్పెషల్ వీడియో లతో పాటుగా స్పెషల్ పోస్టర్స్ కూడా విశేష స్పందన తెచ్చుకున్నాయి.

తాజాగా ‘RRR’ సినిమా రెండు పాటలు మినహా పూర్తిగా కంప్లీట్ అయ్యింది. దీంతో సినిమా షూటింగ్ కు సంబంధించిన మేకింగ్ వీడియోను రాజమౌళి టీం విడుదల చేసింది. ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి వెండితెర అద్భుతాన్ని క్రియేట్ చేయడానికి జక్కన్న అండ్ టీమ్ ఎంతటి కృషి చేసింది అనేది ఈ మేకింగ్ వీడియోలో చూపించారు. ఇప్పటి వరకు అందరూ అనుకుంటున్నట్లే రాజమౌళి ”రోర్ ఆఫ్ RRR” ని మేకింగ్ వీడియోలా కాకుండా స్పెషల్ ట్రైలర్ మాదిరిగా కట్ చేశారు. గూస్ బమ్స్ తెప్పించేలా దీన్ని డ్8డిజైన్ చేశారని చెప్పవచ్చు.

Rajamouli and Jr NTR and Ram Charan's RRR making video out

ఇందులో అల్లూరి సీతారామరాజు – కొమురం భీమ్ లుగా నటించిన రామ్ చరణ్ – ఎన్టీఆర్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ ఏ రేంజ్ లో కష్టపడ్డారో అర్థం అవుతోంది. భారీ సెట్స్ ఏర్పాటు చేసి భారీ క్యాస్టింగ్ అండ్ సిబ్బందితో దర్శకుడు రాజమౌళి చిత్రీకరణ ఏ విధంగా చేసారనేది తెలుస్తోంది. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచదేశాలకు చాటిన దర్శకుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’తో కూడా షేక్ చేయబోతున్నాడని అర్థమవుతోంది. మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రధారులుగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

RRR Making video photos

భారీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ ను సైతం ఈ వీడియోలో చూపించారు. సినిమా ఎలా ఉంటుందో ఈ యాక్షన్లతో తెలిసింది. సినిమా అంచనాలు అందేలా ఉంది. ఈ ఏడాది అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ఈ వీడియోలో ప్రకటించింది.

Watch Here Roar Of RRR Making Video 

Poll: సోషల్ మీడియాలో ఏ తెలుగు నటుడు బాగా ప్రాచుర్యం పొందారు