Jr NTR Birthday special updates: ప్రతి ఏడాది మే నెల అంటే ఎన్టీఆర్ ఫ్యాన్సీ హంగామా మామూలుగా ఉండదు. మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏడాది తన కొత్త సినిమాలు అలాగే జరగబోతున్న సినిమాలో అప్డేట్స్ ఇవ్వడం కోసం మేకర్స్ కూడా ప్రత్యేకంగా పోస్టర్లు అలాగే వీడియోలు రెడీ చేస్తూ ఉంటారు. అలాగే ఈసారి కూడా జూనియర్ ఎన్టీఆర్ చేయబోతున్న సినిమాల అప్డేట్స్ కోసము ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. NTR30, War2, NTR32 సినిమాలకు సంబంధించిన టైటిల్స్ పోస్టర్లు అలాగే వీడియోలు మేకర్స్ రెడీ చేస్తున్నట్టు సమాచారం.
Jr NTR Birthday special updates: ఇక విషయంలోకి వెళ్తే, ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కొరటాల శివ దర్శకత్వంలో NTR30 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మొదటి రెండు షెడ్యూల్లో యాక్షన్ పార్ట్ ని కంప్లీట్ చేసుకున్న కొరటాల టీం ఇప్పుడు ఎన్టీఆర్ బర్త్డే ట్రీట్ రెడీ చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది. NTR30 సినిమా నుండి టైటిల్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ విడుదల చేస్తారని సమాచారం అయితే అందుతుంది.
దీని తర్వాత డిసెంబర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ (NTR) తన బాలీవుడ్ మొదటి సినిమా అయినా WAR2 షూటింగ్ కార్యక్రమాల్లో పాల్గొంటారు. తారక్ మొదటిసారిగా డైరెక్ట్ హిందీ సినిమా చేస్తుండటంతో ఫ్యాన్స్ సంబరాలకి అంతులేకుండా పోయింది. సమాచారం మేరకు ఈ సినిమా నుండి కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ లాగా పోస్టర్ని విడుదల చేయడానికి సినిమా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారంట.
ఇక మోస్ట్ అవైటెడ్ మూవీ గా ట్రెండ్ అవుతున్నా దర్శకుడు ప్రశాంత్ నీల్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. NTR31 పేరుతో వస్తున్న ఈ సినిమా బర్త్డే విషెస్ పోస్టర్ను కూడా వదలబోతున్నట్లు తెలిసింది. ఇక వీటితోపాటు ఎన్టీఆర్ తన రాబోయే కొత్త ప్రాజెక్టుల గురించి కూడా అనౌన్స్మెంట్ వస్తాయని చెబుతున్నారు. వీటిలో ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా అనౌన్స్మెంట్ పోస్టరు విడుదలకు సిద్ధం చేస్తున్నారంట. అంటే.. మొత్తంగా ఈ నందమూరి హీరో బర్త్డే సందర్భంగా ఏకంగా నాలుగు సర్ప్రైజ్లు వస్తున్నాయన్న మాట.
Web Title: Jr NTR Birthday special upcoming movie updates posters ready for May 20, Trivikram, Jr NTR new movie poster, NTR30 title and first look, NTR31 poster, Prashanth Neel movie birthday poster, Jr NTR upcoming movie news