కొత్త స్పోర్ట్స్ కారు కొన్న జూనియర్ ఎన్టీఆర్

488
jr-ntr-bought-bran-new-sports-car-with-5-crore-and-its-importing-from-italy
jr-ntr-bought-bran-new-sports-car-with-5-crore-and-its-importing-from-italy

తెలుగు హీరోలకు కార్ల పిచ్చి బాగానే ఉంది. మార్కెట్‌లోకి కొత్త కారు వచ్చిందంటే చాలు.. తమ వాకిట్లో ఉండాలనుకునే వాళ్లు చాలా మందే ఉన్నారు టాలీవుడ్‌లో. కొందరు మాత్రమే ఒకే కారును వాడుతుంటారు. కానీ మరికొందరు మాత్రం ఏడాదికో కారు మారుస్తూనే ఉంటారు. అందులో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉంటాడు.

ఈయన దగ్గర కార్స్ కలెక్షన్స్ చాలానే ఉంది. ఎప్పుడూ ఒకే కారులో తిరగడం యంగ్ టైగర్‌కు అస్సలు నచ్చదు. అందుకే ఎప్పటికప్పుడు ట్రెండ్‌ను బట్టి కార్లు మారుస్తూనే ఉంటాడు ఈయన. అయితే కొంతకాలంగా కార్ మార్చని ఎన్టీఆర్.. ఇప్పుడు మాత్రం అదిరిపోయే కొత్త కార్ తీసుకుంటున్నాడు. ఇప్పటికే దీన్ని బుక్ చేసాడు కూడా.

ఇండియాలో లేకపోతే ఇటలీ నుంచి ఈ కారును దిగుమతి చేయిస్తున్నాడు జూనియర్. ఆ కారు పేరు లంబోర్ఘిని ఉరుస్.. ఈ మోడల్ కారును ఆయన బుక్ చేసాడు. దీని ఖరీదు 5 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అత్యంత విలాసవంతమైన ఈ కారు ఇటలీ నుంచి ఇండియాకు ప్రత్యేకంగా ఎన్టీఆర్ కోసం త్వరలోనే చేరుకుంటుంది. ఇది సూపర్ స్పోర్ట్స్ కార్.

అంతే కాదు ఆల్ సర్ఫేస్ క్వాలిటీ కార్. అంటే కేవలం రోడ్ల మీద మాత్రమే కాదు.. దట్టమైన ఎడారి ప్రాంతంలో కూడా అదిరిపోయే రైడ్ చేయొచ్చు. దాంతో పాటు కొండ ప్రాంతంలో కూడా ఈ కారు ఎలాంటి సమస్య లేకుండా ముందుకు దూసుకుపోతుంది. ఎంత స్పోర్ట్స్ కారు అయినా కూడా అన్నిచోట్లా అలా చేయడం అంత ఈజీ కాదు.

ఎందుకంటే కోట్లలో రేటు కదా.. చిన్న గీటు పడినా దాని నష్టం లక్షల్లో ఉంటుంది. అందుకే జాగ్రత్తగానే ఉంటారు. ఏదేమైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ కొత్త కారు గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చ బాగానే జరుగుతుంది. ఇప్పటి వరకు ఇంత విలువైన కారు తెలుగులో ఎవరితోనూ లేదు. ప్రభాస్ వాడుకున్న 4 కోట్ల కారే ఇప్పటి వరకు హైయ్యస్ట్. ఇప్పుడు దాన్ని తారక్ బీట్ చేస్తున్నాడు. ఏదేమైనా కూడా కొత్త కారులో త్వరలోనే షికారు చేయబోతున్నాడు యంగ్ టైగర్.

ప్రస్తుతం ఈయన ట్రిపుల్ ఆర్ సినిమాతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్, ప్రశాంత్ నీల్, కొరటాల శివ లాంటి దర్శకులకు కూడా కమిట్‌మెంట్ ఇచ్చాడు. ఒక్కో సినిమాకు దాదాపు 40 కోట్లకు పైగా పారితోషికం అందుకుంటున్నాడు జూనియర్ ఎన్టీఆర్.