తారక్ క్రేజ్ ఎట్ జపాన్..మళ్లీ అదరగొట్టారు.!

0
257
Tarak Craze at Japan..Crazy again.!
Tarak Craze at Japan..Crazy again.!

Jr NTR:బాహుబలి తర్వాత మన హీరోలకు పక్క రాష్ట్రాలేం ఖర్మ.. పక్క దేశాల్లో కూడా మంచి ఇమేజ్ వచ్చింది. అందులోనూ జపాన్ లాంటి దేశాల్లో కూడా మన హీరోలను గుర్తు పడుతున్నారు. అక్కడ మన సినిమాలను చూస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు మన దగ్గర ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు.. తారక్ బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటో అతని డే 1 వసూళ్ల ఫిగర్స్ చెప్తాయి.

అయితే ఎలాంటి పాన్ ఇండియన్ సినిమా కూడా తీయకుండా ఎల్లలు చేరిపేసింది మాత్రం మన టాలీవుడ్ నుంచి తారక్ మాత్రమే అని చెప్పాలి. ఈయన పాటలు చూసి మురిసిపోతున్నారు.. ఎన్టీఆర్ స్టెప్పులు చూసి ఫిదా అయిపోతున్నారు. ఇప్పటికే జపాన్‌లోని రియాలిటీ షోలలో కూడా ఎన్టీఆర్ పాటలకు స్టెప్పులు వేసారు. తాజాగా కొన్ని రోజుల నుంచి అక్కడ ఓ అన్నాచెల్లెళ్లు వరసగా జూనియర్ పాటలపై కవర్ సాంగ్స్ చేస్తున్నారు. వాళ్లే మునిరూ, ఆశాహి ససాకీ.

“కంత్రి” సినిమాలోని వయస్సునామి సాంగ్ ఎంచుకొని దాన్ని అద్భుతంగా ప్రెజెంట్ చేశారు..భార్య భర్తలు ఇద్దరు ఇంటి పనులు చేస్తూ నవ్విస్తూనే తారక్ మరియు హన్సికలు వేసిన స్టెప్పులను అచ్చు గుద్దినట్లు దింపేసి మళ్లీ ఆశ్చర్యపరిచారు.

 

Previous articleNayanthara Goa photos
Next articleహీరోయిన్ మిమీ చక్రబర్తికి లైంగిక వేధింపులు..