నేడు దివంగత నటుడు నందమూరి హరికృష్ణ (Harikrishna) 64వ జయంతి. ఈ సందర్భంగా తండ్రిని తలుచుకుని హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) భావోద్వేగానికి లోనయ్యారు. ట్విటర్ వేదికగా తండ్రికి నివాళులు అర్పించారు.
‘ మిస్ యూ నాన్నా.. ఈ అస్తిత్వం మీరు. ఈ వ్యక్తిత్వం మీరు.. మొక్కవోని ధైర్యంతో కొనసాగే మా ప్రస్థానానికి నేతృత్వం మీరు . ఆజన్మాంతం తలుచుకునే అశ్రుకణం మీరే’.. మీ 64వ జయంతిన మిమ్మల్ని స్మరించుకుంటూ మీ నందమూరి కళ్యాణ్ రామ్, నందమూరి తారకరామారావు’ అంటూ మనసులోని భావాలను వ్యక్తీకరించారు.
కళ్యాణ్ రామ్ కూడా బాధాతప్త హృదయంతో తండ్రిని స్మరించుకున్నారు. కాగా నందమూరి తారకరామారావు వారసుడిగా అటు నటుడిగానూ, ఇటు రాజకీయ నాయకుడిగానూ హరికృష్ణ అందరి మన్ననలు అందుకున్నారు. ఎన్టీఆర్ రధసారథిగా ఖ్యాతి గడించిన నందమూరి హరికృష్ణ 2018 ఆగష్టు 29న నల్గొండలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు.