SSMB29 Update: రామ్ చరణ్ (Ram Charan) అలాగే ఎన్టీఆర్ (NTR) నటించిన RRR మూవీ జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) బాహుబలి తర్వాత తీస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే రాజమౌళి ప్రమోషన్స్ ని చేస్తున్నారు. RRR ప్రమోషన్లో భాగంగా రాజమౌళి మళ్లీ మహేష్ బాబు (Mahesh Babu SSMB) సినిమా గురించి మాట్లాడారు.
బాలీవుడ్ మీడియా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రామ్ చరణ్ ఎన్టీఆర్ రాజమౌళి (Rajamouli) పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో మహేష్ బాబు (Mahesh Babu) సినిమా గురించి అడగగా రాజమౌళి ఇలా సమాధానమిచ్చారు. “నేను మహేష్ తో ఓ సినిమా ప్రకటించి ఉన్నాను. ఎలాంటి సినిమా చేయాలనే దానిపై ఇప్పటికే మా నాన్నతో డిస్కష్ చేసా.ఇది కచ్చితంగా ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్.”
మహేష్ బాబు (Mahesh Babu) స్టోరీ గురించి కూడా రాజమౌళి (Rajamouli) మాట్లాడటం జరిగింది. “ఎలాంటి సినిమా చేయాలనే దానిపై ఇప్పటికే మా నాన్నతో డిస్కష్ చేసా. ఆయన కొన్ని ఐడియాస్ అనుకున్నారు. కాకపోతే వాటి మీద డీఫ్ గా ఇంకా ఆలోచించలేదు.దీని కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.” అని చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ (NTR) కలుగజేసుకొని మహేష్ (Mahesh Babu) – రాజమౌళి సినిమా గురించి ఖచ్చితమైన సమాచారం తనకు తెలుసని.. ఈ సినిమా 2026లో రిలీజ్ అవుతుందని ఫన్నీ కామెంట్స్ చేయటం జరిగింది. అయితే రాజమౌళి ‘నో వే’ అంటూ సమాధానమిచ్చారు.
ఇంక మహేష్ బాబు (Mahesh Babu) రాజమౌళి (Rajamouli) సినిమా కథ విషయానికి వస్తే. ఈ సినిమా కథ గురించి అంతకుముందే చాలా రకాలుగా ఊహాగానాలు వినిపించాయి. మహేష్ బాబు కోసం ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఓ అడ్వెంచరస్ స్టోరీ రెడీ చేస్తున్నట్లు విజయేంద్ర ప్రసాద్ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
మరి ఎన్టీఆర్ (NTR) చెప్పినట్టే మహేష్ బాబు (Mahesh Babu) సినిమా స్టోరీ డిస్కషన్స్ జరిగి 2023 లో షూటింగ్ కి వెళ్లి, 2026 రిలీజ్ అవుతుందా లేదంటే అంతకుముందే సినిమా షూటింగ్ జరిగి రిలీజ్ అవుతుందనేది చూడాలి.