NTR Role in Devara Movie: జూనియర్ ఎన్టీఆర్ అలాగే కొరటాల శివ (Koratala Siva) రెండోసారి కలిసి చేస్తున్న సినిమా దేవర. ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాదులో షూటింగ్ సర్వేకంగా జరుపుకుంటుంది. సినిమా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు దేవరా సినిమా షూటింగ్ని (Devara shooting) అక్టోబర్ లేద నవంబర్ కి ముగించాలని కొరటాల అలాగే ఎన్టీఆర్ చాలా ప్రయత్నాలు చేస్తున్నట్టు చెబుతున్నారు.
Jr NTR character in Devara : ఇక ఈ సినిమాలో బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ అలాగే సైఫ్ అలీ ఖాన్ కీలకమైన పాత్రలు నటిస్తున్న విషయం తెలిసిందే. వీళ్ళతో పాటు టాలీవుడ్ నుంచి అగ్ర నటీనటులు కూడా ఈ సినిమాల కనిపించబోతున్నారు. లేటెస్ట్ గా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ అలాగే ఎన్టీఆర్ పాత్రల గురించి న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
వీటి గురించి ఆరా తీయగా, శివ రాసుకున్న కథకి విలన్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ తన పాత్ర అత్యంత క్రూరంగా ఉండబోతున్నట్టు..ఆదిపురుష్ సినిమా లో రావణ్ పాత్రలో చాలా వైల్డ్ గా ఉన్న దానికంటే పది రెట్లు అరాచకంగా ఉంటుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

ఇక ఎన్టీఆర్ పాత్ర గురించి వస్తే, సైఫ్ కి మించిన ఎలివేషన్స్ తో అలాగే జై లవకుశ సినిమాలో రావణ పాత్రకి రెబల్ గ ఉంటుందని సమాచారమైతే తెలుస్తుంది. కొరటాల శివ ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలకి ఎక్కువ ప్రాధాన్యత కూడా ఇచ్చినట్టు సమాచారమైతే అందుతుంది. మొత్తానికి దేవర సినిమా పై అంచనాలు పెంచే విధంగా సైఫ్ అలీ ఖాన్ పాత్ర అలాగే ఎన్టీఆర్ గురించి ప్రచారం జరుగుతోంది.