Jr NTR OTT Entry confirmed: జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న తన తదుపరి సినిమా NTR30 షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. మొదటి రెండు షెడ్యూల్లో యాక్షన్ సన్నివేశాలని కంప్లీట్ చేసుకున్న టీం.. మే 17 వ తారీకు నుండి కొత్త షూటింగ్ షెడ్యూల్ ని ప్రారంభించడానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నారు. NTR30 సినిమాలో జాహ్నవి కపూర్ హీరోయిన్గా చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయుటకు సిద్ధం చేస్తున్నారు మేకర్స్. దీనిని బట్టి చూస్తే జూనియర్ ఎన్టీఆర్ స్క్రీన్ మీద కనబడటానికి ఎట్ట లేదన్న కూడా ఒక సంవత్సరం టైం పడుతుంది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఓటీటీ లోకి (Jr NTR OTT) అడుగుపెడుతున్నట్టు న్యూస్ వైరల్ అవుతుంది. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ప్రకారం చిన్న అలాగే పెద్ద హీరోలు అనేది తేడా లేకుండా ఓటీటీ ఎంట్రీ ఇస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ (Jr NTR Host) గా.. మీలో ఎవరు కోటీశ్వరులు, బిగ్ బాస్ చేయడం జరిగింది. ఈ రెండు షోలు అత్యంత భారీ టిఆర్పి తో టీవీల్లో రన్ అయ్యాయి. ఇప్పుడు మళ్లీ ఈటీవీ విన్ ఒటీటీ ప్లాట్ ఫామ్ కోసం జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ఒక షో ప్లాన్ చేస్తున్నారంట. ఈ షో గురించి పూర్తి వివరాలు తెలియక పోయినప్పటికీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ మాత్రం ఉంటుందనే మాట వినిపిస్తోంది.
NTR30 విడుదలకు ముందే జూనియర్ ఎన్టీఆర్ మనకు ఈటీవీ విన్ ఒటీటీ షో (OTT Show) ద్వారా ఎంటర్టైన్ చేయడానికి అన్ని రకాలుగా సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. దీనిపై అఫీషియల్ ప్రకటన మరికొన్ని రోజుల్లో అనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయంట. కేవలం ఫ్యాన్స్ కోసమే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
Web Title: Jr NTR host for Etv win OTT talk show, Jr NTR enter into ETV win OTT this year, Jr NTR Host for another talk show for OTT platform. NTR30 shooting update