Jr NTR host for new talk show: తారక్ కు టాలీవుడ్ లో ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ మూవీ లో తారక్ (Tarak) నటించిన కొమరం భీమ్ క్యారెక్టర్ కి ఇండియాలోనే కాక విదేశాలలో కూడా అందరూ ఫిదా అయ్యారు. ఎవరు ఊహించని క్రేజ్ నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ దక్కడంతో ఎన్టీఆర్ (Jr NTR) కు దక్కింది. దీంతో అతను తర్వాత నటించబోయే చిత్రాలపై అంచనాలు భారీగా ఉన్నాయి.
Jr NTR host for new talk show:ఇప్పటికే ఎన్టీఆర్ వరుస క్రేజీ ప్రాజెక్ట్స్ తో బాగా బిజీగా ఉన్నారు. ఇంతకుముందు తారక్ బుల్లితెర పై హోస్ట్ చేసిన బిగ్బాస్ మరియు మీలో ఎవరు కోటీశ్వరులు లాంటి షోస్ లో తారక్ లో ఎన్నడూ చూడని ఫన్నీ మోడ్ ని ప్రేక్షకులు అందరూ ఆస్వాదించారు.ఈ నేపథ్యంలో మరోసారి ఎన్టీఆర్ (Jr NTR) బుల్లితెరపై సందడి చేయబోతున్నాడు అనే వార్త తారక్ అభిమానులకు పండుగ వాతావరణం తెలుస్తుంది.
తారక్ తో మరో రియాల్టీ షో ప్లాన్ చేయడానికి ప్రస్తుతం ఓ టెలివిజన్ షో (TV Show) నిర్వహకులు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంభోలో తెరకెక్కుతున్న NTR30వ సినిమా తరువాత హృతిక్ రోషన్ తో ఎన్టీఆర్ కి WAR 2 బాలీవుడ్ మెగా ప్రాజెక్ట్ లైన్ అప్ లో ఉంది. ఇది కాక ప్రశాంత్ నీతో ఎన్టీఆర్ మరో సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు.
అయితే ఈ మూవీస్ అన్ని పాన్ ఇండియా రేంజ్ మూవీస్ కావడంతో రిలీజ్ అవ్వడానికి బాగానే సమయం పడుతుంది. అనుకున్నవన్నీ జరిగితే మాత్రం ఫాన్స్ తారక్ ని తెరపై చూడడానికి అంతసేపు వెయిట్ చెయ్ అక్కర్లేదు త్వరలో తారక్ బుల్లితెరపై (Small screen) తిరిగి సందడి చేస్తారు. బిగ్బాస్ షోలో హోస్టుగా చేసినప్పుడు తారక్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో షోను ఓ రేంజ్ కు తీసుకువెళ్లాడు.
మరోపక్క ఎవరు మీరు కోటీశ్వరుడు షో ను కూడా తన గ్రేస్ ఎక్కడ బోర్ కొట్టకుండా నడిపించి మంచి మార్కులు కొట్టేశాడు. ఈ కొత్త ఫోను హోస్ట్ (NTR host for ETV Show) చేయడానికి ఇప్పటికే ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే నవంబర్ చివరలో ఈ షో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.